మెడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగిపోవడం అంశంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ప్రకటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
మెడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విస్తృత తనికీలు..
ఇప్పటికే ప్రభుత్వం మెడిగడ్డ విషయంలో సీరియస్ గా స్పందించింది.
మెడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మెడిగడ్డ వద్ద పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ అధికారులతో ఇచ్చింది.
మెడిగడ్డ లో జరిగిన పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యూడిషియల్ విచారణ జరుపుతామని ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు క్యాబినెట్ సమావేశంలో తీర్మాణం చేసింది.
సిట్టింగ్ జడ్జి విచారణ కోసం
హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి కి లేఖ రాసారు.
ఈ రోజు విజిలెన్స్ దాడులు నీటి పారుదల శాఖ కార్యాలయాలలో తనికీలతో మెడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.