నాడు టాలీవుడ్ సినిమాలో నటించిన హీరోయిన్ (Actress Mamata kulkarni) ఇప్పుడు సన్యాసం తీసుకున్నారు. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాల్లో నటించిన మమతా కులకర్ణి ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళాలో (kumbmela) సాధ్విగా మారిపోయారు. ఈమె పలు బాలీవుడ్ చిత్రాల్లోను (bollywood movies) నటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుంభమేళా(kumbmela)కు రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. సన్యాసం స్వీకరించటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈమె సన్యాసం స్వీకరించిన తర్వాత మమతానంద్ గిరి సాధ్విగా పేరు మార్చుకున్నారు. హీరోయిన్ గా ఉన్నప్పుడు మమతా కులకర్ణి ఫోటోలు.. సన్యాసం తీసుకున్న తర్వాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Advertisement -