Renu Desai: టాలీవుడ్ నటి, నిర్మాత, దర్శకరాలు రేణు దేశాయ్ హాస్పిటల్లో ఉన్న ఫొటోలను షేర్ చేయగానే నెట్టింట అవి తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆమె అనారోగ్య కారణంతో హాస్పిటల్లో జాయిన్ కాలేదని తెలుసుకున్నారు. సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణు దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటోంది. జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం వంటి విషయాలపై ఆమె శ్రద్ధ వహిస్తున్నారు. అందుకోసం హాస్పిటల్‌కు వెళ్లి రేబిస్ టీకా వేయించుకున్నారు.
Also Read – Rishab Shetty: బాక్సాఫీస్ రిపోర్ట్: ‘ఛావా’కు చేరువవుతున్న ‘కాంతార చాప్టర్ 1’
కుక్కలను సంరక్షించే సమయంలో ఆ మూగజీవాలు ఆమెను కొరకటం, గీరటం వంటి చేస్తున్నాయి. అందువల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఆమె రేబిస్, టెటానస్ వ్యాక్సిన్స్‌ను తీసుకున్నట్లు స్వయంగా తెలియజేశారు. అంతే కాదు. ఇలా టీకా తీసుకున్న వీడియోను ఆమె చిత్రీకరించి కూడా పోస్ట్ చేశారు. ఇలా టీకాలు తీసుకునే సమయంలో ఎన్నడూ వీడియోలు, ఫొటోలు తీసుకోలేదని, ఆ ఆలోచన కూడా రాదని ఆమె పేర్కొంది. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా ప్రజల్లో అవగాహన ఏర్పడేందుకు టీకా తీసుకుంటున్న వీడియోను రికార్డ్ చేశారు.
https://www.instagram.com/p/DP59rV5gfLt/
మూగ జీవాలైన కుక్కలను సంరక్షించటానికి ఆమె చూపించే ప్రేమ, ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఎమోషనల్ సిట్యువేషన్స్‌ను మనం గమనించవచ్చు. ఇటీవల జబ్బు పడ్డ కుక్కను కాపాడే క్రమంలో దాని పరిస్థితి చూసి ఆమె చాలా బాధ పడ్డారు. ఇదే క్రమంలో ఆమె ఓ విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. అదేంటంటే.. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటానికి చాలా మంది వాలంటీర్లు కావాలన్నారు రేణు. మనుషులపైనే మాత్రమే కాకుండా ఇతర జంతువులను కూడా కాపాడుకోవాలన్నారు. సినిమాల విషయానికి వస్తే.. రేణు దేశాయ్ చివరిగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో కనిపించారు.
Also Read – Rashmika Mandanna: రెండు వారాల్లో రెండు క్రేజీ ప్రాజెక్ట్.. భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న నేషనల్ క్రష్


