Wednesday, June 18, 2025
HomeNewsSamyuktha: సంయుక్తా మీన‌న్ స్పీడు

Samyuktha: సంయుక్తా మీన‌న్ స్పీడు

Samyuktha Menon: సంయుక్తా మీనన్… పేరుకే మలయాళ బ్యూటీ, కానీ ప్రస్తుతం ఆమె పేరు అన్ని ఇండస్ట్రీల్లో ట్రెండ్ అవుతోంది. ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దూసుకెళ్తూ ఒక్కొక్కటిగా క్రేజీ ప్రాజెక్టుల్ని తన ఖాతాలో వేసుకుంటోంది. పవన్ కళ్యాణ్, రానా లాంటి స్టార్లతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త, ఆ వెంటనే వరుస విజయాలతో ప్రేక్షకుల దృష్టిని సంపాదించుకుంది. ఇటీవల ఆమెకు వచ్చిన ట్యాగ్‌ “గోల్డెన్ లెగ్”. ఎందుకంటే ఫ్లాపుల్లో ఉన్న హీరోలు ఆమెతో కలిసిన తర్వాత హిట్ కొడుతున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ఆమె నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “స్వయంభు”, అలాగే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న “అఖండ 2” లాంటి భారీ సినిమాల్లో నటిస్తోంది. ఇందులో మాస్, ఎమోషన్ మిక్స్‌గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందని టాక్. అంతే కాదు, తాజాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న మరో పాన్ ఇండియా మూవీకీ ఓకే చెప్పిందని సమాచారం. దీంతో ప్రస్తుతం ఆమె చేతిలో ఏడో ప్రాజెక్ట్ కూడా చేరిపోగా, ఏడే ఏడాది మొత్తం ఫుల్ బుక్ అయిపోయింది. ఈ ఏడాదిలోనే సంయుక్త బాలీవుడ్‌కి కూడా అడుగుపెడుతోంది. కాజోల్‌తో కలిసి “మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్” అనే ఉమెన్ సెంట్రిక్ మూవీలో నటిస్తోంది.

ALSO READ: https://teluguprabha.net/news/nayanthara-as-the-heroine-in-nagarjuna-100th-film/

ఇవే కాకుండా శర్వానంద్ సరసన “నారీ నారీ నడుమ మురారి”, బెల్లంకొండ శ్రీనివాస్‌తో “హైందవ” వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే హైందవ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ కోసం రెడీ అవుతున్న ఈ సినిమా కూడా భారీగా ప్రమోట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి “రామ్” అనే సినిమాలోనూ నటిస్తున్న సంయుక్త, ఆ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కావాలని ఎదురుచూస్తోంది. ఇక ఈ ఏడాది ఆమెకు మరో భారీ బ్లాక్‌బస్టర్ అవకాశంగా మారబోతున్నది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా, భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందుతోన్న “బెంజ్” చిత్రంలో లారెన్స్ జోడీగా సంయుక్తను ఎంపిక చేశారు.

ఇలా చూసుకుంటే 2025లో సంయుక్త మీనన్ సినిమాల లిస్టు చూస్తే మామూలుగా లేదు. ఏ భాష అని తేడా లేకుండా ఏకంగా 7 క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుండటంతో, ఆమె ప్లానింగ్‌, కెరీర్ గ్రోత్ చూసి ఫ్యాన్స్‌నే కాదు, ఇండస్ట్రీలోని మిగతా హీరోయిన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే, 2025, సంయుక్త డామినేషన్ అన్నట్లే ఉంది. ఈ మధ్య అమ్మడు కాస్త స్లో అయినట్లే అనిపించినా రానున్న కాలంలో వరుస సినిమాలతో ఆమె సందడి చేయటం పక్కా అని సినీ సర్కిల్స్ టాక్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News