Sunday, July 7, 2024
HomeNewsఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ ..రికార్డ్స్ బద్దలు

ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ ..రికార్డ్స్ బద్దలు

- Advertisement -

అంత అనుకున్నట్లే ఆదిపురుష్ మూవీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ విజయం సాదించలేకపోయిన సంగతి తెలిసిందే. సాహో, రాధే శ్యామ్ చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై, ఫస్ట్ డే భారీ వసూళ్లు సాధించినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా అలరించలేక రెండో రోజు నుండే కలెక్షన్లు డ్రాప్ అవ్వడం కనిపించి , చివరకు డిజాస్టర్లు గా మిగిలాయి. ఇక ఇప్పుడు నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన ఆదిపురుష్ సైతం ప్రేక్షకులను పూర్తిసాయిలో మెప్పించలేకపోయింది.

ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా రూపొందిన ఈ మూవీ లో ప్రభాస్ శ్రీ రాముడి గా, కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించారు. ఈ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్‌పై ఓం రౌత్ డైరెక్ట్ చేసాడు. ట్రైలర్ , పోస్టర్స్ తో సినిమా ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ సినిమా మాత్రం ఆ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీతగా ఉండడం , VFX సైతం దారుణంగా ఉండడం తో థియేటర్స్ నుండి బయటకు వచ్చిన జనాలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే.. ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదలైన ఈ మూవీ..ప్రీమియర్ షోస్ , మొదటి రోజు షోస్ తోనే వన్ మిలియన్ వసూళ్లు సాధించి రికార్డ్స్ లోకి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లే సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ వసూళ్లే సాధించినట్లు తెలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వంద కోట్లకు పైగా వసూళ్ళు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు మొదటి రోజు వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఆరు ఉన్నాయి. ఆ ఆరులో మూడు ప్రభాస్ సినిమాలే కావడం విశేషం. బాహుబలి , సాహో, ఆదిపురుష్ చిత్రాలు ఫస్ట్ డే వంద కోట్లు సాధించి రికార్డ్స్ లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News