Thursday, July 4, 2024
HomeNewsరివ్యూ : ఆదిపురుష్ - రామాయణాన్నే మరచిపోతాం

రివ్యూ : ఆదిపురుష్ – రామాయణాన్నే మరచిపోతాం

- Advertisement -

యావత్ సినీ లోకం తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ మూవీ..ఈరోజు (జూన్ 16) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడి గా, కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా ఈ మూవీ లో నటించారు. ఈ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్‌పై ఓం రౌత్ డైరెక్ట్ చేసాడు. ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? రాముడి గా నటించిన ప్రభాస్ నటన ఎలా ఉంది..? ఓం రౌత్ డైరెక్షన్ ఎలా ఉంది..? నటి నటుల నటన తీరు ఎలా ఉంది.? టెక్నీకల్ వర్క్స్ ఎలా ఉన్నాయి..? అనేవి ఇప్పుడు చూద్దాం.

రామాయణం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన కథే. రాముడు..సీతను తీసుకొని వనవాసం వెళ్లడం..అక్కడ రావణాసురుడు ..సీతను ఎత్తుకెళ్లడం..సీతను వెతుకుంటూ రాముడు వెళ్లడం..ఆ తర్వాత ఆంజనేయుడి సాయంతో సీత జాడను తెలుసుకోవడం..సీత కోసం రావణాసురిడితో యుద్ధం చేయడం..ఆ యుద్ధంలో రావణాసురిడిని చంపి..సీతను తెచ్చుకోవడం. ఇది అందరికి తెలిసిందే. ఇదే కథను మన బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి ప్రేక్షకులకు చూపించాడు. కాకపోతే రామాయణ కథను చెప్పాల్సింది పోయి..గ్రాఫిక్స్ తో ఏంచేయొచ్చనేది చూపించాడు.

అందరికి తెలిసిన కథనే భారీ గ్రాఫిక్స్ తో అసలు కథనే మరచిపోయేలా చేసాడు ఓం. రాముడు , రావణాసురుడు, లక్ష్మణుడు ఎలా ఉంటారో అందరికి తెలుసు..కానీ ఆదిపురుష్ లో మాత్రం మరో విధంగా చూపించాడు. మోడ్రన్ డ్రెస్ లతో , డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో చూపించాడు. రామాయణంలో యుద్దాలు ఎలా ఉండేవో..రాముడు – రావణాసురుడు మధ్య బాణాలతో ఎలాంటి యుద్దాలు జరిగాయో మనకు తెలుసు. కానీ ఈ మూవీ లో మాత్రం గ్రాఫిక్స్ తో ఏలియన్స్ తో యుద్ధం చేయడం..కొండలు దూకడం , ఆకాశంలోకి ఎగరడం వంటి రకరకాల విన్యాసాలు చేసి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. పోనీ రాముడు పాత్రను హైలైట్ ఏమైనా చేశాడా అంటే అది లేదు. రావణాసురుడిని , హనుమంతుని హైలైట్ చేసి రాముడి పాత్రను తగ్గించాడు. హనుమంతుడు.. లక్ష్మణుడు పాత్రలకు ఇచ్చిన ఎలివేషన్ రాముడికి దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రామాయణంలో ఎమోషనల్ ఉంటుంది..కానీ ఓం మాత్రం ఎమోషనల్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

సీత పాత్రలో కృతి సనన్ మామూలుగానే అనిపిస్తుంది. ఆమె పాత్ర కూడా తక్కువే. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఏమాత్రం సెట్ కాలేదు. ఇక సినిమాలో కాస్త బెటర్ అనిపించేవి ఏమైనా ఉన్నాయంటే..అజయ్-అతుల్ మ్యూజిక్ , జై శ్రీరామ్ సాంగ్ , కార్తీక్ పళని ఛాయాగ్రహణం. ఓవరాల్ గా మాత్రం ఆదిపురుష్ చూస్తే..రామాయణం చూసాం అనే ఫీలింగ్ కన్నా కార్టూన్ మూవీ చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News