Saturday, June 14, 2025
HomeNewsAMA Chief Bobby Mukkamala: AMA అధ్యక్షుడిగా తొలి భారతీయడు

AMA Chief Bobby Mukkamala: AMA అధ్యక్షుడిగా తొలి భారతీయడు

AMA Chief Bobby Mukkamala: అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (బాబీ) ఎన్నికయ్యారు. 178 సంవత్సరాల AMA చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక సంస్థకు నాయకత్వం వహించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. చికాగోలో జరిగిన AMA వార్షిక సమావేశంలో ఆయన ఈ కీలక బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -


అమెరికా ఆరోగ్య వ్యవస్థలో దీర్ఘకాలంగా నెలకొన్న సవాళ్లను పరిష్కరించడంపై తాను దృష్టి సారిస్తానని డాక్టర్ ముక్కామల స్పష్టం చేశారు. డిజిటల్ హెల్త్ టెక్నాలజీని ప్రోత్సహిస్తూ, ఆరోగ్య సంరక్షణ సంస్కరణలు, వైద్యుల సంక్షేమం కోసం AMA గట్టిగా కృషి చేస్తుందని వివరించారు.

ఆలోచనా దృక్పథాన్ని మార్చేసింది :
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ జీవితంలో ఓ పెద్ద సవాల్‌ను ఎదుర్కొన్నారు. గత నవంబర్‌లో ఆయనకు 8 సెంటీమీటర్ల మెదడు కణితి ఉన్నట్లు గుర్తించగా, మూడు వారాల తర్వాత విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. తన వైద్య బృందం, కుటుంబం, వైద్య పురోగతి వల్లే తాను జీవించగలిగానని ఆయన తెలిపారు. వైద్యుడి నుంచి రోగిగా మారిన అనుభవం ఆరోగ్య సంరక్షణ పట్ల తన ఆలోచనా దృక్పథాన్ని మరింత మార్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం డాక్టర్ ముక్కామల రేడియాలాజిస్ట్ గా మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. భారతదేశంలో జన్మించిన ఆయన, అమెరికాలో వైద్య విద్యను పూర్తిచేసి, గతంలో AMA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌తో పాటు మిచిగాన్ స్టేట్ మెడికల్ సొసైటీలో కీలక పదవులు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News