Kavya Maran Anirudh Marriage : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘వై దిస్ కోలవెరి డి’ పాటతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పాటలు థియేటర్లలో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేస్తాయి. అదే విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించినప్పుడు కావ్యా మారన్ (SRH ఓనర్) ముఖంలో కనిపించే ఆనందం కూడా క్రికెట్ అభిమానులను అంతే ఆనందంలో ముంచేస్తుంది. ఈ రెండు సంచలనాల కలయికగా గత కొంతకాలంగా వినిపిస్తున్న ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే అనిరుధ్, కావ్యా మారన్ పెళ్లి వార్త. వీళ్లిద్దరు “ఏడాదిగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పెళ్లికి హాజరుకానున్నారని” కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై అనిరుధ్ రవిచంద్రన్ స్పందించారు. మరి ఆయన ఏమన్నారంటే ?
అనిరుధ్ పెళ్లి వార్తలకు X పోస్ట్‌తో చెక్ :
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్యా మారన్‌తో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ వివాహం అంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి స్వయంగా అనిరుధ్ ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ వార్తలను ఖండిస్తూ ఆయన శనివారం తన X ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. అందులో”చిల్ గాయ్స్, నాకు పెళ్లా? దయచేసి ఇలాంటి రూమర్స్ ప్రచారం చేయకండి” అంటూ అనిరుధ్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.
కళానిధి మారన్, అనిరుధ్ పనితీరు, పుకార్లు:
కళానిధి మారన్ నిర్మించిన సూపర్ హిట్ చిత్రాలైన జైలర్,బీస్ట్ తో పాటుగా రాయన్’ వంటి సినిమాలకు అనిరుధ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ప్రాజెక్ట్‌లలో కలిసి పని చేస్తున్న సమయంలోనే కావ్యా, అనిరుధ్ మధ్య ప్రేమ చిగురించిందనే పుకార్లు మొదలయ్యాయి. అయితే, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని అనిరుధ్ స్వయంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం అనిరుధ్ ‘కింగ్డమ్’, ‘కూలి’, ‘జననాయకన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నారు.
కావ్యా మారన్: క్రికెట్ నుండి వ్యాపారాల వరకు:
32 ఏళ్ల కావ్యా మారన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా ఆమె జట్టు కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలో ఉత్సాహంగా కనిపించి, తమ జట్టు ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటారు. క్రికెట్‌తో పాటు, కావ్యా పలు వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. వివిధ నివేదికల ప్రకారం ఆమె నికర విలువ సుమారు రూ. 410 కోట్లు ఉండవచ్చని అంచనా. మొత్తంగా చూస్తే, కళానిధి మారన్, అనిరుధ్ కలిసి పని చేసిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలవగా, కావ్యా మారన్ ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. వీరి చుట్టూ అల్లిన ప్రేమ కథలు కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి.
Anirudh and Kavya’s Wedding Buzz : రజనీకాంత్ చీఫ్ గెస్ట్…
- Advertisement -