Thursday, July 4, 2024
HomeNewsఆదిపురుష్ విషయంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైందా..?

ఆదిపురుష్ విషయంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైందా..?

- Advertisement -

ఎన్నో అంచనాల నడుమ నిన్న (జూన్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ చిత్రానికి అన్ని చోట్ల మిశ్రమ టాక్ నడుస్తుంది. ట్రైలర్ చూసి సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని వెళ్తే..డైరెక్టర్ ఓం తీవ్ర నిరాశకు గురిచేసాడని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఫలితం ఫై ముందే ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. ఆదిపురుష్ మూవీ అంతగా ఉండదని , బాహుబలి రేంజ్ హిట్ కాదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమైందంటూ సోషల్ మీడియా లో అంత మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆలా చెప్పింది ఎవరు..? అసలు ఆయన ఏంచెప్పాడనేది చూస్తే..

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు ముందే ఈ మూవీ గురించి , ప్రభాస్ జాతకం గురించి చెప్పుకొచ్చాడు. ప్రభాస్ జాతకరీత్యా ఆది పురుష్ మూవీ సంచలనాలు సృష్టించే అవకాశం లేదని, బాహుబలి స్థాయి హిట్ ను ఆశించవద్దు అంటూ ఆయన తెలిపాడు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం కావడం తో ఆయన అన్న మాటలను సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.

ఇక సినిమాకు టాక్ నెగిటివ్ గా వచ్చినప్పటికీ ..అభిమానులు మాత్రం ఓ విషయంలో తెగ సంబరపడొచ్చు. అదే ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవొచ్చు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లను రాబట్టి రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం ప్రభాస్ సరికొత్త రికార్డ్‌ను కొట్టేశాడు. ఈ వీకెండ్ వరకు ఈ కలెక్షన్ల సునామీ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఇక తెలంగాణలో ఇప్పటివరకు తొలిరోజున సాధించిన షేర్ విషయంలో ‘RRR’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటె..ఇప్పుడు రెండో స్థానంలో ఆదిపురుష్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ తెలంగాణ లో ఫస్ట్ డే 23.35 కోట్ల షేర్ ను రాబట్టగా..ఆదిపురుష్ 12.24 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News