Tuesday, September 24, 2024
HomeNewsరెండో సినిమా మొదలుపెట్టిన 'బలగం' వేణు

రెండో సినిమా మొదలుపెట్టిన ‘బలగం’ వేణు

- Advertisement -

బలగం మూవీ తో సైలెంట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వేణు..తన రెండో సినిమా పనులు ప్రారంభించాడు. 2000 లో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వేణు..అప్పటి నుండి చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చాడు. కానీ జబర్దస్త్ షో తో వేణు కు క్రేజ్ ఏర్పడింది. ఇక వేణు లో టాలెంట్ ను గుర్తించిన నిర్మాత దిల్ రాజు..తన డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ను వేణు ఉపయోయించుకున్నాడు. తెలంగాణ నేపధ్య కథను ఎంచుకొని సైలెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఎన్నో అవార్డ్స్ అందుకున్నాడు. ఈ విజయం తో వేణు రెండో సినిమా ఫై అటు చిత్రసీమలో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.

వేణు నుంచి రెండో చిత్రం ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వేణు తన రెండో సినిమా అప్డేట్ ఇచ్చారు. తను తీయబోతున్న రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి పెన్ను, పేపర్ ఫోటోని షేర్ చేశారు. తన రెండో సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ ఉండేలా వేణు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

ఈ సినిమా కూడా ‘బలగం’ మాదిరే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి వేణు రెండో సినిమా కథ ఏంటి..? నటి నటులెవరూ..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News