Bigg Boss wild card Entries: బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ సామాన్యులు వర్సెస్ సెలబ్రెటీల మధ్య పోరాటం హోరాహోరీగా సాగుతోంది. కాగా.. ఈ సీజన్ మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ 9 తెలుగులో బిగ్ ట్విస్ట్ రాబోతోంది. ఈ పాపులర్ రియాలిటీ షోను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వారమే వైల్డ్ కార్డు ఎంట్రీలను ప్రవేశపెడుతున్నారని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. ఫస్ట్ బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా కామనర్స్ వస్తారని సమాచారం.
ఈ వీక్ వైల్డ్ కార్డు
తొలి రెండు వారాల్లో వరుసగా శ్రష్టి వర్మ, మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు థర్డ్ వీక్ నడుస్తోంది. ఈ మిడ్ వీక్ లోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందని తెలిసింది. అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన ముగ్గురు కామనర్స్ ను ఈ రోజు అర్ధరాత్రి హౌస్ లోకి పంపుతారని సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. బిగ్ బాస్ 9 తెలుగులోకి ముందు వైల్డ్ కార్డు ఎంట్రీలుగా ముగ్గురు కామనర్స్ ను పంపిస్తున్నారని తెలిసింది. వీళ్లు.. నాగ ప్రశాంత్, షకీబ్, దివ్య నిఖిత అని సమాచారం. అయితే ఇందులోనూ బిగ్ బాస్ ఓ ట్విస్ట్ పెట్టారని టాక్. హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వెళ్లే ఈ ముగ్గురు కామనర్స్ లో ఒక్కరు మాత్రమే పర్మినెంట్ కంటెస్టెంట్ అవుతారట. నాగ ప్రశాంత్, షకీబ్, దివ్య నిఖిత హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ల మధ్య టాస్క్ పెట్టి గెలిచిన ఒక్కరిని మాత్రమే కంటెస్టెంట్ గా కొనసాగించనున్నారు. ఓడిపోయిన ఇద్దరినీ బయటకు పంపిస్తారని తెలిసింది.
Read Also: Rithu Chowdhary: నా భర్తతో రీతూ చౌదరి ఎఫైర్.. హీరో భార్య సంచలన కామెంట్స్
సెలబ్రిటీలు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో వారానికో సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఓనర్లను టెనెంట్లుగా, టెనెంట్లను ఓనర్లుగా మార్చేశారు. ఇక మిడ్ వీక్ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇస్తున్నారు. అలాగే వచ్చే వారం సెలబ్రిటీలను కొంతమందిని వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగా హౌస్ లోకి పంపిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ లిస్ట్ లో కొంతమంది పేర్లు చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఇందులో సీరియల్ హీరోయిన్లు సుహాసిని, కావ్య పేర్లు వైరల్ గా మారాయి. వీళ్లతో పాటు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దివ్వెల మాధురి, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలుగా పంపే ఛాన్స్ ఉంది. తనీష్, అమర్ దీప్ లు మరోసారి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.


