Bitter gourd uses: టేస్ట్ చేదే.. కానీ లాభాలెన్నో తెలుసా..! కాకరకాయ (Bitter Gourd) ఎంత చేదుగా ఉన్నా.. దానికుండే ఫ్యాన్స్ దానికుంటారు. వారంలో ఒకరోజు కాకరకాయ వేపుడో, ఇగురో, పొడో చేసుకోకుండా ఉండలేరు. కాకరాయ ఏ రకమైనది అయినా.. ఎంత చేదు ఉన్నా ఇష్టపడి తింటారు. అయితే ఈ చేదు కాకరాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, మానవ శరీరానికి ఉపయోగపడే పోషకాలు కూడా ఉంటాయి. అవేంటో చూసేద్దామా మరి.
1. పోషకాల సామ్రాజ్యం:
100 గ్రా. కాకర కాయలో కేవలం 21 కేలొరీస్ మాత్రమే ఉండి, విటమిన్ C‑99%, విటమిన్ A‑2% తో పాటుఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫైబర్ ఉంటుంది.యాంటీఆక్సిడెంట్లు (catechin, gallic acid, epicatechin, chlorogenic acid) ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా రక్షిస్తాయి.
2. డయాబెటిస్ నియంత్రణ:
ప్లాంట్ ఇన్సులిన్ అని పిలువబడే Polypeptide ఉండటం వల్ల అది చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
3. చెడు కొలెస్ట్రాల్ & హార్ట్ హెల్త్:
LDL cholesterol ను తగ్గించే లక్షణాలు కాకరకాయలు ఉన్నాయి. ఇవి ఇప్పటికే అనేక పరిశోధనల్లో కూడా రుజువయ్యాయి.వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం ఉండడం వల్ల గుండెకు మేలు చేయడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
4. జీర్ణవ్యవస్థ & బరువు:
మంచి ఫైబర్, తక్కువ ఫైట్లేన్సు కారణంగా పేగు కదలికలు మెరుగవుతాయి, మలబద్ధకం తగ్గుతుంది.తక్కువ కేలరీలు, శక్తివంతమైన ఫైబర్ తో బరువు తగ్గడంలో తోడ్పడుతాయి.
5. రోగనిరోధక శక్తి & రుగ్మత:
యాంటీ ఆక్సిడెంట్ గుణాల కారణంగా శరీర నిరోధక వ్యవస్థకు కాకరకాయ మేలు చేస్తుంది.యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఫంగల్, యాంటీ-పారాసిటిక్ లక్షణాలు కూడా ఇందులో ఉంటాయి.
6. క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు:
ద్రవ పరీక్షలలో క్యాన్సర్ కణాలను అడ్డుకునే లక్షణాలు కాకరకాయలో ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతారు.