బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నట్టు తాజా ట్రెండ్స్ రుజువు చేస్తున్నాయి. హాఫ్ వే మార్క్ టచ్ చేసిన బీజేపీ 35 స్థానాల్లో దూసుకుపోతోంది. మరోవైపు ఆప్ కేవలం 19 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా ఆప్ కీలక నేతలంతా వెనుకంజలో ఉన్నారు. కాగా కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. కాగా ఢిల్లీలో అత్యధిక జనాభా అయిన పంజాబీలు ఆప్ ను కాదని, బీజేపీకి ఓటువేయటంతో బీజేపీ స్పష్టమైన విజయం దిశగా దూసుకుపోతోంది.