ఢిల్లీలో కమల వికసించింది. అదికూడా థమ్స్ అప్ మెజారిటీతో గెలుపొందటం విశేషం. కాగా ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత అధికారంలోకి రానున్న బీజేపీ ఏకంగా తన ఓట్ షేర్ ను 47.84 శాతం పెంచుకోవటం విశేషం. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ స్పష్టమైన ఓట్ షేర్ సాధించగా, మతకల్లోల్లాలు జరిగిన చోట కూడా కాషాయ పార్టీ లీడింగ్ లో ఉంది.
- Advertisement -
పదిన్నరకల్లా బీజేపీ 44 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక గత ఎన్నికల ఫలితాలనే రిపీట్ చేస్తూ కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవకపోవటం విశేషం. చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి.