Thursday, September 19, 2024
HomeNewsBRS first list: అందరూ ఊహించిన ఆ ఏడుగురు మినహా సిట్టింగులందరికీ టికెట్లు

BRS first list: అందరూ ఊహించిన ఆ ఏడుగురు మినహా సిట్టింగులందరికీ టికెట్లు

బీఆర్ఎస్ తొలి జాబితా అందరూ ఊహించినదే

రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఫస్ట్ లిస్టులో ఏడుగురు సిట్టింగులు మినహా మిగతావారందరికీ టికెట్లు దక్కాయి. అయితే టికెట్లు రానివారు అసంతృప్తికి గురికావద్దని, బీఆర్ఎస్ పార్టీ ఓ మహా సముద్రమని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక అందరూ ఊహించినట్టే ..తాటికొండ రాజయ్య – స్టేషన్‌ఘన్‌పూర్‌, రేఖానాయక్‌ – ఖానాపూర్‌, చెన్నమనేని రమేష్‌ – వేములవాడ,
గంప గోవర్ధన్‌ – కామారెడ్డి, రాథోడ్‌ బాపూరావ్‌ – బోథ్‌, ఉప్పల్‌ – భేతి సుభాష్‌రెడ్డి, వైర – రాములు నాయక్‌ లకు టికెట్ దక్కలేదు.

- Advertisement -

హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని సీఎం వెల్లడించారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News