చౌటుప్పల్, భువనగిరి వలిగొండ, గజ్వేల్ మండలాల భూ నిర్వాసితులు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ జై రామ్ గడ్కారీని కలిసి వినతి పత్రం సమర్పించారు.
అనంతరం బాధితులు కేంద్రమంత్రితో మాట్లాడుతూ నార్త్ సైడ్ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ని 28 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల కు మార్చాలని కోరారు. త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దక్షిణ భాగాన ఓ ఆర్ ఆర్ నుండి 40 కిలోమీటర్లకి మార్చారని, నార్త్ సైడ్ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ నీ 28 కిలోమీటర్లకి చేయడం వలన చౌటుప్పల, బోనగిరి, గజ్వేల్ మున్సిపాలిటీ ప్రాంతాలు రెండు మూడు భాగాలుగా విడిపోతున్నాయని, హెచ్ఎండిఏ ప్లాట్లు, విలువైన భూములు, గృహాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ నీ సౌత్ సైడ్ లాగా ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్లకి మార్చి వారికి న్యాయం చేయాలని కోరారు.
అనంతరం మంత్రి స్పందించి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ పైన పునరాలోచన చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. వారి వెంట కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి తోపాటు భూ నిర్వాసితుల సంఘం కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి, త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులు గుజ్జుల సురేందర్ రెడ్డి, మరుపాక లింగం గౌడ్, దబ్బేటి రాములు గౌడ్, జాల వెంకటేష్ యాదవ్, బోరం ప్రకాష్ రెడ్డి, కొడారి నర్సింగరావు, మోదుగు అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.