యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించి రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరుకు తిరుగుపయణమైన ముఖ్యమంత్రి.
తూకివాకం సమీపంలోని ఆర్పిఆర్ కళ్యాణ మండపం నందు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించి మధ్యాహ్నం 12.38 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సాదర వీడ్కోలు లభించింది.

డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, తిరుపతి మునిసిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్,టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ట్రైనీ ఎస్పి బొడ్డు హేమంత్, పలమనేరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి వెంకట ముని ప్రసాద్(నాని), శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు పలికారు.

అంతకు మునుపు ఆర్పీఆర్ కళ్యాణమండపం చేరుకున్న ముఖ్యమంత్రికి నరసింహ యాదవ్ దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లి నూతన వధూ వరులను అక్షింతలు వేసి నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని ఆశీర్వదించారు. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ డైరీ 2025 ను ఆవిష్కరించారు.

అనంతరం ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలోని కార్యక్రమంలో పాల్గొనుటకు హెలికాప్టర్ నందు బయలుదేరి వెళ్లారు.