Thursday, September 19, 2024
HomeNewsConsumet Alert: రెచ్చిపోతున్న పెట్రోల్ మాఫియా, కనీస వసతులు కరువు

Consumet Alert: రెచ్చిపోతున్న పెట్రోల్ మాఫియా, కనీస వసతులు కరువు

పెట్రోల్ బంక్ మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యక్తిగత వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో పెట్రోలు పంపుకు వెళ్లటం నిత్యావసరంగా మారిపోయింది. మరి పెట్రోల్ పంపుల్లో ఉండాల్సిన అసలు సౌలభ్యాలు, ఉచిత సేవలు ఏంటో మీరెప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారు. రెచ్చిపోతున్న పెట్రోల్ మాఫియా నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగదారులు పెట్రోల్ పంపుల్లో తప్పకుండా అందించాల్సిన సేవల వివరాలు తెలుసుకుతీరాల్సిందే.

- Advertisement -

వాహనం లేని ఇళ్లు దాదాపు మనకు కనిపించవు. స్కూటరో, కారో తప్పకుండా అందరి ఇళ్లలో కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి మనమంతా తరచూ పెట్రోల్ బంకులకు వెళ్తుంటాం. కానీ పెట్రోల్ పంపులు ఇంధనం ఒకటే లభించదు. అలాగే మనం చెల్లించేటటువంటి ప్రతి ఒక్క పైసా వాహనానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వాహనానికి అవసరమైన కనీస వస్తు, సేవలు పెట్రోల్ బంక్ లో లభ్యమవుతాయి. కేవలం అవగాహన లేకనే చాలామంది వాటిని ఉపయోగించుకోలేక మోసపోతున్నారు. కనీస వసతులు కూడా ఏర్పాటు చేయని పెట్రోల్ బంకులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిపై ఫిర్యాదులు చేసిన దాఖలాలు కూడా లేకపోవడం కోసం మెరుపు.

పెట్రోల్ బంకుల్లో వివిధ రకాల సేవలను ఉచితంగానే పొందొచ్చు. ఫ్రీగానే టైర్‌కు గాలి కొట్టించుకోవచ్చు. మంచి నీటి సదుపాయం ఉంటుంది. వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ నాణ్యతను పరీక్షించొచ్చు. కానీ ఇలాంటివాటిపై అవగాహన లేక మనం ఫ్యూయల్ కొట్టించుకుని ఇంటికి వచ్చేస్తాం. ఈసారి మీరు ఇలాంటి పొరపాటు అస్సలు చేయద్దు.

ఫిల్టర్ పేపర్ టెస్ట్ చేశారా ?
పెట్రోల్, డీజిల్ నాణ్యతను ఈ పెట్రోల్ పంపుల్లోనే సరిచూసుకోవచ్చు. ఏ పెట్రోల్ బంకుల్లో అయినా సరే ఫిల్టర్ పేపర్ టెస్ట్ సాయంతో పెట్రోల్, డీజిల్‌ను పరీక్షించొచ్చు. ఇది కూడా ఉచితంగానే చేయవచ్చు. అలాగే లీటరుకు పెట్రోల్ తక్కువగా వస్తోందని అనుమానం వచ్చినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
ఫస్ట్ ఎయిడ్ కూడా
ప్రమాదాలు ఎక్కడైనా జరగొచ్చు. అది హైవే కావొచ్చు. సిటీలోనే కావొచ్చు. ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు మీరు కూడా అక్కడే ఉంటే దగ్గరిలోని పెట్రోల్ బంకుకు వెళ్లి అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని, గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేయవచ్చు. పెట్రోల్ షాపులు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తప్పకుండా ఉండాల్సిందే.
ఎమర్జెన్సీ కాల్స్
వాహనదారులు పెట్రోల్ ఫిలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఎమర్జెన్సీ కాల్స్ కూడా చేసుకోవచ్చు. పెట్రోల్ బంకులు మీకు పోన్ కాల్ సదుపాయాన్ని కల్పించి తీరాలి. రోడ్డుపై మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోతే, మీకు ఏదైనా సాయం అవసరమైతే పెట్రోల్ బంకులు వెళ్లొచ్చు.
బాత్రూము సదుపాయం
ఏదైనా ట్రిప్‌కు బయలుదేరినప్పుడు లేదంటే సొంత ఊరికి ప్రయాణమైనప్పుడు సిటీ దాటిన తర్వాత వాష్‌రూమ్స్‌తో పెద్ద సమస్య ఎదురుకావొచ్చు. ప్రత్యేకించి మహిళలకు ఇబ్బందులు ఉండొచ్చు. ఇలాంటప్పుడు కూడా పెట్రోల్ బంకులు మనకు ఉపయోగపడతాయి. ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే పెట్రోల్ బంకుల్లో వాష్‌రూమ్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
తాగునీటి సదుపాయం
పెట్రోల్ బంకులు మంచి నీటిని కూడా ఉచితంగానే కస్టమర్లకు అందించాలి. మీరు అక్కడే నీళ్లు తాగొచ్చు. లేదంటే బాటిల్‌కు నింపుకోవచ్చు.
గాలి పెట్టించుకోండి
మీరు పెట్రోల్ బంకుల్లో వాహన టైర్లకు గాలి కొట్టించుకుంటున్నారా? దీనికి డబ్బులు చెల్లిస్తున్నారా? అయితే ఇకనైనా డబ్బులు ఇవ్వడం మానేయండి. ప్రతి పెట్రోల్ బంకు ఉచితంగానే టైర్లకు గాలి నింపాలి. మీ వద్ద ఎవరైనా డబ్బులు అడిగితే కంప్లైంట్ కూడా చేయవచ్చు.

కాబట్టి ఇకమీదట మీరు పెట్రోల్ పంపులోని సేవలన్నింటినీ ఉచితంగా, అన్ కండిషనల్ గా ఎంజాయ్ చేయచ్చు. వీటికయ్యే ఖర్చులన్నీ కలిపే మనతో ఇంధనం ఛార్జీలు వసూలు చేస్తారు. నిర్మొహమాటంగా మీరు పెట్రోల్ స్టేషన్స్ లో అన్ని సదుపాయాలు పొందవచ్చు. ఇలాంటి సదుపాయాలు లేకపోతే కంప్లైంట్ చేసేయటమే. వినియోగదారులూ మేలుకోండి, మీ హక్కులను సంపూర్ణంగా ఆస్వాదించండి. లేకపోతే నిలువుదోపిడీ ఖాయం.

శివకుమార్, ఆందోల్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News