ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ఆయన భార్య బ్రిగెట్టా మెక్రాన్‌ను చెంపపై కొట్టినట్లు కనిపించడంతో, నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. విషయం సామాన్యంగా ఉండకపోవడంతో ఫ్రాన్స్ అంతటా చర్చలకు దారితీసింది. అయితే దీనిపై ఫ్రాన్స్ అధికార వర్గాల కన్నా ముందుగా స్పందించినది రష్యా. విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా దీని మీద సెటైర్లు వేసి మరింత జోరందించారు.
అసలు వీడియోలో ఏముంది: ఇటీవల ఎమాన్యుయేల్ మెక్రాన్ తన భార్య బ్రిగెట్టాతో కలిసి ఆసియా పర్యటనలో భాగంగా వియత్నాం రాజధాని హనోయ్‌కు చేరుకున్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరూ విమానం బయటకు వచ్చారు. ఆ సమయంలో మెక్రాన్ ఎవరో వ్యక్తితో మాట్లాడుతున్నట్టు కనిపించాడు. అంతలోనే ఆయన ముఖంపై భార్య చేతులు వేసినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లలో కొంతమంది ‘మెక్రాన్ గొడవలోకి వెళ్లారు’ అని భావించగా, మరికొందరు అది ఒక సరదా అర్థం ఉన్న క్షణమని చెబుతున్నారు.
ఆ తరువాత, మెక్రాన్ తన భార్య చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఆమె వెంటనే దూరంగా తొలగించుకున్నట్లు వీడియోలో కనబడింది. దీంతో వారి మధ్య విభేదాలున్నాయనే సందేహాలు మరింత ముదిరాయి.
ఈ వీడియోపై రష్యా అధికార ప్రతినిధి మారియా జఖరోవా తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. “భార్య భర్తను ఉత్సాహపరిచేందుకు నెమ్మదిగా తట్టి ఉండొచ్చు. కానీ అది పక్కాగా కొట్టినట్లు కనిపించింది. కాలర్ సరిచేసే ప్రయత్నంలో పొరపాటున తగిలిందేమో.. అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, “ఇది కవర్ చేయడానికి మెక్రాన్ సలహాదారులు ఇప్పుడు రష్యా క్రెమ్లిన్ హస్తం ఉందంటారేమో.. అని సాటైరిక్ రీతిలో పేర్కొన్నారు.
ఈ వీడియోపై ఫ్రెంచ్ మీడియాలో పలువురు ప్రముఖులు, విశ్లేషకులు స్పందించగా, చివరికి మెక్రాన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. “అది మా మధ్య జరిగిన సరదా క్షణం nothing serious. నేను ఒక టిష్యూ తీసుకున్నాను, ఇంకొకరితో షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా భార్యతో చిన్న జోక్ చేశాను. అలాంటి సన్నివేశాలు మాది సాధారణంగా జరుగుతుంటాయి అని ఆయన వివరణ ఇచ్చారు.