ఇండియా పోస్ట్ ఇటీవలె డిజిపిన్ (DIGIPIN) అనే సరికొత్త డిజిటల్ అడ్రస్ సిస్టమ్‌ను అధికారింకగా ప్రారంభించింది. దీని ద్వారా ప్రతి ఇంటికి ఓ ప్రత్యేకమైన 10 అంకెల కోడ్ను ఇండియన్ పోస్ట్ కేటాయిస్తుంది. తద్వారా మీ ఇంటికి ఏదైనా లెటర్ లేదా కొరియర్ అందినప్పుడు ఆ సంఖ్య ద్వారా ఖచ్చితమైన భౌగోళిక స్థానాన్ని అది సూచిస్తుంది. తద్వారా పోస్ట్‌మ్యాన్ సమయం ఆదా అవడంతో పాటు సమయానికి మీ లెటర్ మీ ఇంటికి త్వరిగతిన చేరవేయడానికి అనువుగా ఉంటుంది.
ఈ సిస్టమ్‌ని IIT హైదరాబాద్ అలాగే ISRO నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో అభివృద్ధి చేశారు. దీనివల్ల ప్రధానంగా టౌన్స్, గ్రామాలు దూర ప్రాంతాల్లోనూ మీరు ఖచ్చితమైన డెలివరీని అడ్రస్‌ని సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చు.
డిజిపిన్ ఫీచర్లు:
- ప్రతి డిజిపిన్ ఒక 4×4 మీటర్ల గ్రిడ్‌ను సూచిస్తుంది.
- ఇది కచ్చితమైన లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధారంగా రూపొందించబడింది
- అంతే కాకుండా ప్రైవసీ పరంగా కూడా సురక్షితంగా ఉంటుంది. వ్యక్తిగత సమాచారం ఏదీ ఇందులో సేవ్ అవ్వదు.
- దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సేవల సరఫరా మెరుగుపడనుంది.
మీరు కూడా డిజిపిన్ పొందవచ్చు..
ఇందుకోసం మీరు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Know Your DIGIPIN’పై క్లిక్ చేయాలి. దీని ఆధారంగా మీ ఇంటి యొక్క డిజిపిన్‌ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ GPS స్థానం లేదా మ్యాప్‌లో లొకేషన్‌ని ఆన్ చేస్తేనే కోడ్‌ని పొందే అవకాశం ఉంటుంది.ఈ కొత్త సిస్టమ్‌తో లాస్ట్ మైల్ డెలివరీ, ఎమర్జెన్సీ సేవలు అలాగే ఇ-కామర్స్ వంటి రంగాల్లో కచ్చితత్వం పెరగనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది దేశంలోనే అడ్రస్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్‌గా మార్చే ఓ గొప్ప అడుగు అని చెప్పవచ్చు.