Wednesday, April 2, 2025
HomeNewsCong too aggressive: సెన్సేషనల్ గా మారిన గాడిద గుడ్డు ప్రచారం

Cong too aggressive: సెన్సేషనల్ గా మారిన గాడిద గుడ్డు ప్రచారం

ఆకట్టుకుని, ఆలోచింప చేస్తున్న వినూత్న ప్రచారం

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై వినూత్నంగా ‘గాడిద గుడ్డు’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అడిగినవి ఇవి అని, బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు పేరుతో బ్యానర్ల ఏర్పాటు చేశారు.

- Advertisement -

గాంధీ భవన్ లో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి. తెలంగాణ అడిగినవి ఇవి అంటూ ..రూపాయి పంపిస్తే, 43 పైసల బిచ్చం నుండి విముక్తి, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా, బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, కనీసం ఒక్క IIM, NID విద్యాలయం, 811 టీఎంసీ కృష్ణ జలాలలో సరైన వాటా, కనీసం ఒక్క IIT & మెడికల్ కాలేజీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్ & కరీంనగర్, బీజేపీ ఇచ్చింది ఇది! అంటూ వినూత్నంగా గాడిద ఫొటో, గాడిద గుడ్డును ప్రతిబింబించేలా బ్యానర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News