Saturday, May 18, 2024
HomeNewsGarla: బెల్టు షాపులపై దాడులు

Garla: బెల్టు షాపులపై దాడులు

ముందస్తు జాగ్రత్తలో..

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గార్ల మండల పరిధిలోని పోచారం కోట్యా నాయక్ తండ గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 1,950 రూపాయల విలువైన వివిధ రకాల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ధరం సోత్ కృష్ణపై ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీనత్ కుమార్ తెలిపారు.

- Advertisement -

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ దాడులు నిర్వహించామన్నారు. మండల వ్యాప్తంగా ఎవరైనా బెల్ట్ షాపుల పేరిట అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సైతో పాటు కానిస్టేబుల్ లు మంగీలాల్ శ్రీనివాస్ రాము పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News