Saturday, February 22, 2025
HomeNewsGBS: KGHలో మహిళ మృతి.. GBS కారణమా..?

GBS: KGHలో మహిళ మృతి.. GBS కారణమా..?

విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో జీబీఎస్(GBS) అనుమానస్పద లక్షణాలతో చికిత్స పొందుతున్న పేషెంట్ రేణుకా మహంతి మరణించినట్లు ప్రకటిస్తున్నామని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద తెలిపారు. అయితే ఈమె జీబీఎస్ లక్షణాలతో మృతి చెందలేదని గుండెపోటుతోనే మరణించినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించారు.


వివరాలు
ఈ నెల 6 వ తేదీన కింగ్ జార్జ్ ఆసుపత్రికి విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామానికి చెందిన 63 ఏళ్ల మహిళా రోగి రేణుకా మహంతి వచ్చారు. రేణుకా మహంతిని కింగ్ జార్జ్ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగంలో చేర్చారు. ఆమెకు గుయిలెయిన్-బారే సిండ్రోమ్ (GBS) అని అనుమానస్పదముగా ఆసుపత్రి నందు అడ్మిట్ చేశారని వైద్యులు తెలిపారు. ఆమెకు మధుమేహం (షుగర్), బ్లడ్ ప్రెషర్ ఉన్నాయి. వెంటనే ప్రామాణిక వైద్య ప్రోటోకాల్‌ ప్రకారం చికిత్స అందించినట్లు తెలిపారు. రెగ్యులర్ వైద్య పర్యవేక్షణలో ఆమె పరిస్థితి మెరుగుదల చూపించిందని తెలిపారు.

తీవ్రమైన ఛాతీ నొప్పి
అయితే ఈ రోజు (సోమవారం) ఉదయం 9 గంటలకు మెడికల్ సూపరింటెండెంట్ నిర్వహించిన వార్డ్స్ రౌండ్స్ లో, రేణుకా మహంతి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలిపారు. అనుకోకుండా రేణుకా మహంతికి ఆకస్మికంగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. తరువాత కుప్పకూలిపోయిందని వైద్యులు తెలిపారు. తీవ్రమైన కొరోనరీ ఆర్టరీ లోపం కారణంగా తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (గుండెపోటు) (Heart Attack ) అని తేలింది. వైద్య మరియు నర్సింగ్ బృందాలు వైద్యం అందించిన రేణుకా మహంతి కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు.

మరణానికి ప్రధాన కారణం తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (Heart Attack ) అని నిర్ధారించబడింది మరియు ఆమె జిబిఎస్ వ్యాధితో మరణించలేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద నిర్దారించడమైందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News