పండుగల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇటీవల కాస్త తగ్గినట్లు కనిపించిన గోల్డ్ ధరలు.. ఇప్పుడు ఆకాశం వైపు పరుగులు పెడుతున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు పండుగల సీజన్ రావడంతో పసిడి చేతికి అందనంటుంది. మరికొన్ని రోజుల్లో దీపావళి, ధన్ తేరస్ ఉన్న నేపథ్యంలో పరుగులు తీయడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా మూడో రోజు కూడా ధరలు భారీగా పెరిగాయి.
శుక్రవారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి.. రూ.72,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరిగి.. రూ.78,980గా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు వెండి కూడా నేనేమైనా తక్కువ అంటూ వేగంగా పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది. దీంతో కిలో వెండి రూ.99,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో వెండి లక్షరూపాయలు దాటేసింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,400
విజయవాడ – రూ.72,400
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,980
విజయవాడ – రూ.78,980
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,05,000
విజయవాడ – రూ.1,05,000