LIC Policy special offer: భారతదేశంలో కోట్ల మంది ప్రజల నమ్మకానికి చిహ్నం ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బీమా కంపెనీల్లో ఒకటిగా కూడా గుర్తింపును పొందింది. దేశంలోని మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలను టార్గెట్ చేస్తూ అనేక బీమా ఉత్పత్తులను కంపెనీ అందిస్తోంది. ప్రధానంగా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వరకు వివిధ సేవలను ఆఫర్ చేస్తోంది. నమ్మకంతో పాటు డబ్బుకు భద్రత కారణంగా చాలా మంది కనీసం ఒక్క పాలసీ అయినా కట్టాలని చూస్తుంటారు.
YSRCP Leaders Meet Undavalli :ఉండవల్లితో వైసీపీ నేతలు భేటీ..ఏం జరుగుతోంది..?
కానీ చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక సమస్యలు చాలా సార్లు వారి పాలసీ చెల్లింపులు చేయలేక మధ్యలోనే వాటిని ఆపేసే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయితే తిరిగి వాటిని పునరుద్ధరించుకోవాలని చూస్తున్న చాలా కుటుంబాలకు ఎల్ఐసీ ఒక శుభవార్త ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ఇన్సూరెన్స్ పాలసీలను తిరిగి స్టార్ట్ చేయాలనుకునే వ్యక్తులకు నెల రోజుల పాటు స్పెషల్ అవకాశాన్ని కల్పిస్తోంది.
తాజా స్కీమ్ కింద గతంలో పాలసీ చెల్లింపులు మధ్యలోనే ఆపేసిన వ్యక్తులు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 17 లోపు వాటిని తిరిగి స్టార్ట్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ ప్రకటించింది. దీనికి తోడు ఆలస్యపు చెల్లింపులపై విధించే రుసుముల విషయంలో 30 శాతం తగ్గింపును కూడా ఆఫర్ చేస్తోంది ఎల్ఐసీ. ఇక ఇదే క్రమంలో మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ (తక్కువ ఆదాయ కుటుంబం లేదా వ్యక్తికి బీమా పాలసీ) కోసం ఆలస్య రుసుములపై 100 శాతం తగ్గింపును అందిస్తోంది. మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి 5 సంవత్సరాలలోపు పాలసీని ప్రారంభించవచ్చని కంపెనీ ప్రకటించింది.
అయితే ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో పాలసీ మెచ్చూర్ అయ్యి ఉండకూడదని కంపెనీ చెప్పింది. అలాగే సాధారణ వైద్య పరీక్షలు కూడా తప్పనిసరి చేసింది ఎల్ఐసీ. ఇక లేటు చెల్లింపు రుసుమును గరిష్ఠంగా రూ.5వేలకు పరిమితం చేయటంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలకు తిరిగి రక్షణను కల్పించటానికి ఇదొక సదవకాశంగా చాలా మంది మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు.


