Saturday, September 21, 2024
HomeNewsHair damage with sun light: మీ జుట్టుకు ఎండ తగిలేకొద్దీ..

Hair damage with sun light: మీ జుట్టుకు ఎండ తగిలేకొద్దీ..

సహజమైన ప్రొటీన్లు మీ జుట్టునుంచి పోయేలా చేసే ఎండ

ఎండ నుంచి జుట్టును ఇలా కాపాడుకుందాం..

- Advertisement -

సూర్యరశ్మి శిరోజాలను దెబ్బతినేలా చేస్తుంది. అందులోని అతినీలలోహిత కిరణాల ద్వారా రేడియేషన్ ప్రసరించి మానవకణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మాడుపై కూడా ఈ కిరణాల ప్రభావం తీవ్రంగా పడుతుంది. దీంతో జుట్టు స్ట్రక్చర్ దెబ్బతింటుంది. అందుకే వెంట్రుకలు అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్ పిఎఫ్) ఉండే ఉత్పత్తులను వాడాలని శిరోజాల నిపుణులు చెప్తున్నారు.

బీచ్ లాంటి చోట్ల ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు సూర్యరశ్మి ప్రభావం పడే చర్మంపై, మాడుపై
తప్పనిసరిగా ఎస్ పిఎఫ్ ప్రాడక్టులను అప్లై చేసుకోవాలి. సూర్యరశ్మి ప్రభావం జుట్టు కుదుళ్ల నుంచీ పడుతుంది. అతినీలలోహిత కిరణాల వల్ల కణాల నిర్మాణం బలహీనపడ్డంతో పాటు చర్మం బ్రేకవుట్
అవుతుంది. ఫలితంగా మీ వెంట్రుకల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యరశ్మికి లోనుకావడం వల్ల జుట్టులో ఉండే సహజ మాయిశ్చరైజింగ్ గుణాలను కోల్పోతాం. క్లోరినేటెడ్ నీళ్లల్లో ఈత కొట్టినా దాని ప్రభావం వెంట్రుకలపై తీవ్రంగా పడుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు పూర్తిగా దెబ్బతింటుంది. అందులో రంగు వేసుకునే వారి వెంట్రుకలపై ఇది మరింత ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది. సన్
బర్న్ మాడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జుట్టుపై బ్లీచింగ్ ఎఫెక్టును చూపుతుంది.

వెంట్రుకల్లో ఉండే సహజసిద్ధమైన ప్రొటీన్లు సైతం పోతాయి. దీంతో జుట్టు చిట్లడం, బలహీనమవడం జరగుతాయి. అంతేకాదు జుట్టు పీచులా తయారవుతుంది. జుట్టు దెబ్బతినడం వల్ల వెంట్రుకల కొసళ్లు కూడా చిట్లుతాయి. జుట్టు బాగా ఊడుతుంది. సూర్యరశ్మి బారిన పడకుండా వెంట్రుకలను కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఈ టిప్స్ ను తప్పనిసరిగా పాటిస్తే మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న వెంట్రుకలు తొందరగా ఆరోగ్యవంతంగా తయారవవు. సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న వెంట్రుకలకు ప్రొటీన్లు చాలా అవసరం. ఎందుకంటే వెంట్రుకలు కోల్పోయిన తేమను ప్రొటీన్లు తిరిగి పొందేలా చేస్తాయి. దెబ్బతిన్న జుట్టు కొసళ్లను తరచూ ట్రిమ్ చేసుకుంటే కూడా మంచిది. అలాగే జుట్టుకు సన్ స్క్రీన్ తప్సనిసరిగా రాసుకోవాలి. కేరట్ సీడ్ ఆయిల్ వంటి వాటిల్లో ఎస్ పిఎఫ్ బాగా ఉంటుంది. ఇది వెంట్రుకలకు మంచిది. ఉష్ణ్రప్రాంతాల్లో సరిపడే ఆయిల్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో పామ్ కెర్నల్ ఆయిల్, కొబ్బరినూనె జుట్టుపై బాగా పనిచేస్తాయి.

సురక్షితమైన హెయిర్ స్టైల్స్ ను ఫాలో అవడం వల్ల జుట్టుపై నేరుగా అతినీలలోహిత కిరణాలు పడే అవకాశం తక్కువ. అందుకే బన్స్ ఉపయోగించి వేసుకునే హెయిర్ స్టైల్స్ వంటివి వేసుకుంటే శిరోజాలు సురక్షితం అంటున్నారు హెయిర్ స్టైలిస్టులు. జుట్టుపై అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా తలపై క్యాప్స్ పెట్టుకోవాలి. మిట్ట మధ్యాహ్నాల పూట బయటకు వెళ్లడాన్నిపూర్తిగా మానుకుంటే మంచిది. వేసవిలో మీ మాడుపై రకరకాల విషతుల్యమైన పదార్థాలు, కాలుష్యం, అలాగే ఫ్రీరాడికల్స్ సమస్యలు ఎదురవుతాయి. అందుకే మాడుపై చేరే ఇలాంటి మురికి, దుమ్ముధూళిలను పోగొట్టడానికి, ఫ్రీరాడికల్స్ నుంచి విముక్తి కల్గించడానికి డిటాక్సిఫైయింగ్ సిరమ్ ను మాడుకు అప్లై చేసుకోవాలి. హెయిర్ మాస్కు వేసుకోవడం వల్ల మాడు ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ మాస్కులు మాడుకు తేమను అందించడమే కాదు ఎంతో సాంత్వనను ఇస్తాయి. అందుకే మీకు నచ్చే హెయిర్ మాస్కును తలకు పట్టించుకుని రాత్రి నిద్రపోయేటప్పుడు స్క్రార్ఫ్ లాంటిది తలకు పెట్టుకుని పడుకోవాలి. ఉదయం లేచి తలకు షాంపు పెట్టుకుని శుభ్రంగా తలస్నానం చేయాలి. మాయిశ్చరైజింగ్ షాంపుతో తలస్నానం చేస్తే మంచిది.

కండిషనర్ అప్లై చేసుకుంటే జుట్టు చిక్కుపడదు. తడిజుట్టును బ్రష్ తో దువ్వుకుంటే కుదుళ్ల నుంచి
వెంట్రుకలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అలా చేయొద్దు. ఎండల్లో హీట్ స్టైలింగ్, ఎయిర్ డ్రైడ్ స్టైల్స్ వంటి వాటి జోలికి పోవద్దు. ఈ జాగ్రత్తలను పాటిస్తే సూర్యరశ్మి దుష్ప్రరిణామాలకు మీ శిరోజాలు
గురికావు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News