రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ‘హరిహర వీరమల్లు'(Hari hara Veera mallu) సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ మేజర్ పార్ట్‌ని ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన దర్శకత్వం నుంచి తప్పించుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మిగిలిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల ఈ చిత్రంలోని ‘మాట వినాలి'(Maata Vinali) సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ ఈ పాటను పాడడం విశేషం. ఈ పాటకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వాలండైన్స్ డే సందర్భంగా చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం మూడు గంటలకు ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈపోస్టర్‌లో నిధి అగర్వాల్‌ను పవన్ పొడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.

ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సూర్య మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కాగా ‘హరిహర వీరమల్లు-1 ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఈ ఏడాది మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.