Saturday, November 15, 2025
HomeNewsWAR 2 Twitter Review: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ.. ‘వార్ 2’పై నెటిజ‌న్స్ రిపోర్ట్‌

WAR 2 Twitter Review: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ.. ‘వార్ 2’పై నెటిజ‌న్స్ రిపోర్ట్‌

 

- Advertisement -

 

WAR 2 Twitter Review: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్‌, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘వార్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న స్పై యూనివ‌ర్స్‌లో భాగంగానే ఈ సినిమా రూపొందింది. అయాన్ ముఖ‌ర్జీ సినిమాను తెర‌కెక్కించారు. ఎన్టీఆర్ న‌టించిన స్ట్ర‌యిట్ బాలీవుడ్ మూవీ కావటం.. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో న‌టిస్తున్నాడంటూ వార్త‌లు రావ‌టంతో సినిమాపై హైప్ పెరుగుతూ వ‌చ్చింది. వార్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో వార్‌2పై నార్త్ ఆడియెన్స్‌లో భారీ అంచ‌నాలుండ‌టం కామ‌న్. అయితే ఎన్టీఆర్ న‌టిచ‌టంతో తెలుగులో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే తెలుగులో సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సినిమాను రిలీజ్ చేస్తుంది. సినిమాపై అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి. టికెట్ ఫుట్ ఫాల్ కూడా బాగానే జ‌రిగింది. మ‌రి వార్‌2లో హృతిక్‌, ఎన్టీఆర్ మ‌ధ్య పోటీ ఎలా ఉంది? అనే దానిపై ఓవ‌ర్‌సీస్ నుంచి నెటిజ‌న్స్ త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు..

‘వార్ 2’ ఫ‌స్టాఫ్ బావుంది. మెయిన్ లీడ్స్ అయిన హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ పాత్ర‌ల‌కు సంబంధించిన ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. సినిమా స్టారింగ్ ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది. త‌ర్వాత స్పై చిత్రాల త‌ర‌హాలో రొటీన్‌గా సాగింది. ఇంట‌ర్వెల్ సీన్ వ‌ర‌కు రొటీన్‌గానే కంటిన్యూ అవుతూ వ‌చ్చింది. ఇక ఫ‌స్టాఫ్‌లో హృతిక్‌, ఎన్టీఆర్ మ‌ధ్య వ‌చ్చే స‌లాం అనాలి అనే సాంగ్ పీక్స్‌లో ఉంది. అయితే ఇంకా బాగా చేసుంటే బావుండేద‌ని ఓ రివ్యూవ‌ర్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

వార్ 2 బాలీవుడ్ మూవీలా కాదు హాలీవుడ్ మూవీలా ఉందంటూ ఓ నెటిజన్ తన ఓపినియన్ షేర్ చేశాడు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పై యూనివర్స్‌లో బెస్ట్ మూవీని తెరకెక్కించాడని కితాబిచ్చాడు. మరొకరైతే ఇలాంటి యాక్షన్ మూవీని తాను ఎక్స్‌పెక్ట్ చేయలేదని, అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు.

వార్ 2 మూవీ బ్లాక్ బస్టర్ అంటూ కితాబిచ్చిన మరో నెటిజన్ సినిమా మేకింగ్ అద్బుతంగా ఉందని, హృతిక్, ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటాయని పేర్కొన్నాడు.

ఫస్టాఫ్ ఎన్టీఆర్ ఆకట్టుకుంటే, సెకండాఫ్ అంతా హృతిక్ మెప్పించాడని మరో నెటిజన్స్ అన్నాడు.

వార్ 2 ఫస్టాఫ్ చక్కగా ఉంది, బీజీఎం బావుంది. అయితే కొన్ని సీన్స్ మౌండ్ డ్యూ యాడ్స్ లా అనిపిస్తున్నాయని చెబుతూ, ఎన్టీఆర్ నటన పెద్దగా ఆకట్టుకోలేదని, యాక్షన్ సీన్స్ గొప్పగా లేవని అన్నాడు.

 

ఇద్దరు స్టార్ హీరోలు పాతికేళ్ల సినీ ప్రయాణం తర్వాత వారి కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నటించిన చిత్రం వార్ 2. అదీ ఇద్దరూ ఒకే సినిమాలో నటించటం కొస మెరుపు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad