Saturday, November 15, 2025
HomeNewsTata Cars: పంచ్ నుండి సఫారీ వరకు..ఈ టాటా కార్లపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ....

Tata Cars: పంచ్ నుండి సఫారీ వరకు..ఈ టాటా కార్లపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. లక్ష వరకు ఆదా!

Tata Cars Discounts: దేశంలోని అనేక కార్ల కంపెనీ తయారీదారులు కస్టమర్లను ఆకర్షించేందుకు తమ కార్లపై ఆఫర్లను తీసుకువస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వాహన తయారీదారులలో ఒకటైన టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ ఈ నెలలో కొన్ని లిస్ట్ చేసిన టాటా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఇప్పుడు ఏ వాహనంపై కంపెనీ ఎంత డిస్కౌంట్ ఆఫర్ ఇస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

టాటా సఫారీ

టాటా సఫారీని ఈ నెలలో కొనుగోలు చేస్తే అత్యధిక పొదుపు పొందవచ్చు. నివేదికల ప్రకారం..ఈ SUVని కొనుగోలు చేయడంపై రూ. 1.05 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఆఫర్ దీని పాత వెర్షన్‌పై అందుబాటులో ఉంది. కొత్త సఫారీని కొనుగోలు చేయడంపై కూడా ఈ నెలలో లక్ష రూపాయల వరకు ఆదా చేయవచ్చు.

టాటా హారియర్‌

టాటా హారియర్‌ను టాటా మిడ్-సైజ్ SUVగా విక్రయిస్తుంది. ఈ వాహనం పాత వెర్షన్‌ను కొనుగోలు చేస్తే, దాదాపు రూ.1.05 లక్షల వరకు ఆఫర్‌ను పొందవచ్చు. అయితే, కొత్త వెర్షన్ కొనుగోలు చేయడం ద్వారా కూడా ఈ నెలలో గరిష్టంగా లక్ష రూపాయలు ఆదా చేయవచ్చు.

టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్‌ను ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా విక్రయిస్తోంది. ఈ వాహనం ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెలలో కొనుగోలు చేస్తే, రూ. 85 వేల వరకు ఆదా చేయవచ్చు. అయితే, ఈ నెలలో దీని కొత్త వెర్షన్‌పై ఎటువంటి ఆఫర్ లేదు.

టాటా పంచ్‌

ఈ నెలలో టాటా చౌకైన SUVగా అందించే టాటా పంచ్‌ను కొనుగోలు చేస్తే, గరిష్టంగా రూ. 85 వేలు ఆదా చేయవచ్చు. కాగా, ఈ పొదుపు దాని CNG వేరియంట్‌లపై ఉంటుంది. ఇక పంచ్ పెట్రోల్ వేరియంట్‌లను కొనుగోలు చేస్తే రూ. 65 వేల వరకు ఆఫర్‌ ఉంటుంది.

Also read: Second Hand Car: పాత కారు కొనాలనుకుంటున్నారా? ఈ ప్లాన్ మీకోసమే!

టాటా టిగోర్‌

టాటా టిగోర్‌ను కాంపాక్ట్ సెడాన్ విభాగంలో టాటా విక్రయిస్తోంది.ఈ నెలలో ఈ కారును కొనుగోలు చేస్తే, గరిష్టంగా రూ.60 వేల వరకు ఆదా చేయవచ్చు.

టాటా టియాగో

టాటా హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అందించే కారు టాటా టియాగోను ఈ నెలలో కొనుగోలు చేస్తే, గరిష్టంగా రూ.55 వేల రూపాయలు ఆదా అవుతుంది.

టాటా నెక్సాన్‌

టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ కూడా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ నెలలో ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తే, దాదాపు రూ.50 వేల రూపాయలు ఆదా చేయవచ్చు.

టాటా కర్వ్‌

కర్వ్‌ను టాటా కూపే ఎస్‌యూవీగా విక్రయిస్తుంది. ఈ నెలలో తయారీదారు అందించే ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడం ద్వారా రూ. 30 వేల రూపాయల వరకు ఆదా చేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad