Saturday, November 15, 2025
HomeNewsViral News: భార్య సీతపై అలక.. 42 ఏళ్లుగా అన్నం ముట్టని భర్త రామచంద్ర!

Viral News: భార్య సీతపై అలక.. 42 ఏళ్లుగా అన్నం ముట్టని భర్త రామచంద్ర!

Viral News: భార్య-భర్తలంటే చిన్న చిన్న మనస్పర్థలు.. గొడవలు సహజం. పురాణాల్లో దేవతామూర్తులకు కూడా ఈ గిల్లికజ్జాలు తప్పలేదు.. ఇక మానవ మాత్రులం మనమెంత. భర్త అడిగింది భార్య చేయలేదనో.. భార్య కోరిందో భర్త తెచ్చి ఇవ్వలేదనో.. పుటింటి వారి.. అత్తింటి వారి పంతాలు.. ఇలా గొడవకి కారణాలు సవాలక్ష. కానీ.. ఈ గొడవలు, పంతాలు నీటి బుడగలా ఉంటేనే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. లేకపోతే ఆ సంసారం నిత్య నరకంలా మారుతుంది.

- Advertisement -

అయితే.. ఇప్పుడు మనం చూడబోయే ఈ స్టోరీ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఏళ్ళు గడిచిన భర్త పంతం మానలేదు. అలాగని ఆ సంసారంలో పొరపొచ్చలు కూడా లేవు. భార్య భర్తల మధ్య గొడవై 42 ఏళ్లుగా భర్త అన్నం మానేశాడు.. కానీ.. ఇన్నేళ్లలో ఆ దంపతులు సుఖంగానే ఉన్నారు. ఒడిశాలోని జైపుర్ జిల్లాలోని వికీపుర్ గ్రామానికి చెందిన 76 ఏళ్ల రామచంద్రకు 22 ఏళ్ల వయసులో సీత అనే మహిళతో వివాహం జరిగింది. 42 సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది.

రోజూ లాగానే రామచంద్ర ఒకరోజు కూలిపనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. అన్నం పెట్టమని భార్యను కోరగా.. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ వంట చేయలేదని చెప్పింది. అంతే, రామచంద్ర తినడానికి అన్నం పెట్టలేదని ఆమెపై అలకపూనాడు. అప్పటి
నుంచి కోపంతో అన్నం తినడం మానేశాడు. అలాగని ఆమెతో మాట్లాడటం మానేయలేదు. అన్యోన్యంగానే ఉంటాడు. కానీ.. అన్నం మాత్రం తినడు. 42 ఏళ్ళుగా టీ, అటుకులే రాంచంద్రకి ఆహరం. బంధువులు, తమ పిల్లలు సైతం ఎన్నిసార్లు బ్రతిమాలినా రామచంద్ర మాత్రం అన్నం ముట్టుకోలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad