Sunday, November 16, 2025
HomeNewsHusnabad: బతుకమ్మ చీరల పంపిణీ

Husnabad: బతుకమ్మ చీరల పంపిణీ

సత్యవతి, సతీష్ పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు

హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని కేసిఆర్ పాలన స్వర్ణ యుగం లాంటిదని తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు పుట్టింటి సారే లాగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని 500 కోట్ల బడ్జెట్ తో 90 లక్షల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలు బతుకమ్మ చీరలను నేసారని అన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్ని సంక్షేమ పథకాలను మహిళల పేరు మీదనే ఇవ్వడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వివిధ మండలాల ఎంపీపీలు జడ్పిటిసిలుటౌన్ కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad