హీరోయిన్ ఇలియానా రెండోసారి తల్లికాబోతున్నారు. ఇలియానా-మైకోల్ డోలన్ కు తొలి సంతానమైన బాబు కోఆ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇలియానా పోస్ట్ చేస్తుంటారు. కాగా తాను మళ్లీ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెప్పీ చెప్పకుండా వెరైటీగా తన సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ లో ఇలియానా అనౌన్స్ చేయటం విశేషం. అర్ధరాత్రి నోరూరి ఏమోమో తినాలనిపిస్తోందంటూ ఫోటో పెట్టారు.

ప్రస్తుతానికి చేతిలో ఏ హిందీ, తెలుగు సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఇలియానా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, ఆ హైలైట్స్ ను షేర్ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉండి, బాలీవుడ్ పై క్రేజ్ తో వెళ్లి అక్కడ అనుకున్నట్టు కెరీర్ సెట్ కాక మళ్లీ టాలీవుడ్ లో ఆఫర్స్ ఆ స్థాయిలో సంపాదించుకోలేకపోయిన ఇలియానా ఒకటి అరా సినిమాలతో అప్పుడప్పుడూ తెరపైన కనిపిస్తున్నారు.