Thursday, July 4, 2024
HomeNewsIMD: బంగాళాఖాతంలో తుపాను, వర్షాలు

IMD: బంగాళాఖాతంలో తుపాను, వర్షాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఐఎండి సూచనల ప్రకారం దక్షిణ అండమాన్ మరియు ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

- Advertisement -

ఇది రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత, ఇది వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి నైరుతి & ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని అదేవిధంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.

దీని ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి రాయలసీమ, కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్శాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాబోయే రెండు రోజుల వాతావరణ వివరాలు క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు.

గురువారం (30-11-2023)
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నెల్లూరు అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది.

శుక్రవారం (01-12-2023)
నెల్లూరు, నంద్యాల, నెల్లూరు వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కర్నూలు, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది.

దక్షిణ అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారే అవకాశం

శనివారం నాటికి నైరుతి & ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం

దీని ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు

రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు ,
చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్శాలు,
పడే అవకాశం ఉంది

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు

డా. బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News