- Advertisement -
గౌతమ్ అదాని(Gautham Adani) వ్యవహారంలో ప్రపంచ దేశాలు భారత్ పై అనేక విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో… ఇది కేవలం దేశ ప్రతిష్ట ను దెబ్బతీసేందుకు అగ్రరాజ్యాలు చేస్తున్న కుట్ర అని ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ఇరాక్ ,లిబియా,బంగ్లాదేశ్ ,సిరియా వంటి దేశాల్లో అగ్రరాజ్యాలు అంతర్గతంగా విద్వేషాలు రెచ్చగొట్టి ఆయా దేశాలను ఆర్దికంగా ,రాజకీయంగా దెబ్బతీస్తు పరోక్షంగా హింసకు కారణమవుతున్నాయి . అదేవిధంగా ప్రభుత్వాలను కూలుస్తు తమకు అనుకూలంగా ఉన్న వారికి పెత్తనం కట్టబెడుతున్నాయి అని కేంద్ర ప్రభుత్వం అగ్రరాజ్యాలు చేస్తున్న ఆగడాల పై ధ్వజమెత్తింది.