రాకరాక ఒక పెళ్లి సంబంధం వస్తే.. తీరా తాళి కట్టే సమయానికి కంగారు పడ్డాడొ ఆత్రపు పెళ్లికొడుకు. నిలకడలేని ప్రవర్తనతో చక్కగా జరగాల్సిన పెళ్లిని ఆగమాగం చేశాడు. పీటలపై కూర్చున్న వధువుకి బదులు ఆమె వెనుక ఉన్న అత్త మెడలో తాళి కట్టేశాడు. ఇదేంటని అడగ్గా.. బిత్తిరి చూపులు చూశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ వార్త వైరలవుతోంది.
ఎన్నో అడ్డంకులు దాటుకుని పెళ్లి వరకూ వచ్చానన్న ఆనందమో, పెళ్లైపోతుందన్న కంగారో, బాధో గానీ.. పంతులు గారు తాళికట్టు నాయనా అనగానే.. వధువు పక్కనున్న అత్త మెడలో తాళి కట్టేశాడు. ఇదిచూసి పెళ్లికి వచ్చిన అతిథులంతా నోరెళ్లబెట్టాడు. ఇలా చేశాడేంటని నాలుక కరుచుకున్నారు. మరి ఆ తర్వాత ఏం చేశారు ? పంతులు పరిష్కారం ఏం చెప్పాడు ? ఆ వధువుతో పెళ్లి జరిగిందా ? అన్న వివరాలేవీ తెలియరాలేదు సుమీ.