ఈ భూమి మీద పేదరికానికి మించిన శాపం ఇంకేది లేదు. తరతరాలుగా మానవ జాతిని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. ఈ శాపాన్ని రూపు మాపడం అంత సులభం కాదు. పేదరికం నుండి బయట పడడానికి ఒక రోజు చాల దేమో గానీ, పేదరికం లోనికి కూరుకు పోవడానికి ఒక సెకను చాలు. అవి ప్రకృతి ప్రకోపాలు అయినా కావచ్చు, మానవ నిర్మిత చర్యలైనా అవ్వొచ్చు. మొన్నటికి మొన్న లిబియాలో వరదలు, ఆఫ్గనిస్తాన్ లో భూకంపాలు ఎంతో మందిని పేదలుగా మార్చే శాయి. వీటిని ఆపడం మన చేతిలో లేదు. కానీ పాశవిక నాయకుల మానవ దాష్టీనానికి బలైన సామాన్యులు ఒక్క రోజు లోనే ఈ పేదరికంలోనికి కూరుకుపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇజ్రాయిల్ , పాలస్తీనా యుద్ధంలో గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని ఉన్న పళంగా ఖాళీ చేసి వెళ్తున్న వారిలో చాలా మంది నిన్నటి వరకూ బాగా బతికిన వారే..! మరి రేపటి వారి దుస్థితి..? అలాగే హమాస్ ఉగ్రదాడిలో తన వాళ్లందరినీ కోల్పోయి మిగిలిన కుటుంబాల గతి కూడా అంతే.
పేదరిక నిర్మూలన దినోత్సవం
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 17న పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ మంచి పని మరియు సామాజిక రక్షణ అందరికీ గౌరవాన్ని ఆచరణలో పెట్టడం. ఈ సంవత్సరం థీమ్ ప్రజలందరికీ మానవ గౌరవాన్ని నిలబెట్టే సాధనంగా మర్యాదపూర్వకమైన పని మరియు సామాజిక రక్షణకు సార్వత్రిక ప్రాప్యతను కోరుతుంది.
పేదరికం అంటే?
పేదరికం కొలవడానికి ఒక ప్రమాణం చాలదు. ఇది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. సరళంగా చెప్పాలంటే ఒక వ్యక్తి లేదా కుటుంబానికి కనీస జీవన ప్రమా ణాలను భరించే ఆర్థిక వనరులు లేని పరిస్థితిని పేదరికం అని చెప్పొచ్చు. పేదరికం అనేది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇది ఒక వ్యక్తి యొక్క ఆదాయం మరియు సమా జంలో గౌరవంగా జీవించే హక్కుల రెండింటి కలబోత. వీరు వారి పేదరికానికి తోడు గా ప్రమాదకరమైన ప్రదేశాలలో పనిచేయడం, సరైన గృహ వసతి లేకపోవడం, పోష కాహారాన్ని తినలేకపోవడం, సమన్యాయం పొందలేకపోవడం, తగిన రాజకీయ శక్తి లేకపోవడం, నాణ్యమైన వైద్యం లభించకపోవడం మొదలైన ఇతర పరిస్థితులను ఎదు ర్కుంటున్నారు. అంతర్జాతీయ నివేదికలు ప్రధానంగా ఒక కుటుంబం యొక్క ఆరోగ్యం, విద్య , జీవన ప్రమాణాలను కొలమానంగా తీసుకొని తయారు చేస్తారు. ఐక్యరాజ్య సమితి విభాగమైన ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల శాఖ పేదరికం లేని ప్రపంచం కోసం ప్రపంచ చర్యలను వేగవంతం చేయడమే, 2030 ఎజెండాకు అనుగుణంగా స్థిరమైన అభివృద్ధి అని కూడా పరిగణించింది. దాని తీర్మానం 72/233 లో సాధారణ సభ 2018 నుండి 2027 మధ్య కాలాన్ని పేదరిక నిర్మూలన కోసం మూడవ ఐక్యరాజ్యసమితి దశాబ్దంగా ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం పేదరిక నిర్మూలన కోసం మూడవ దశాబ్దాన్ని ప్రారంభించినందున, 2013లో 783 మిలియన్ల మంది ప్రజలు రోజుకు1.90 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవి స్తున్నారని అంచనా వేయబడింది, 1990లో 1.867 బిలియన్ల జనాభా ఉంది. అభి వృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక వృద్ధి 2000 నుండి వేగవంతమైంది. అభివృద్ధి చెం దిన దేశాల కంటే తలసరి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ ఆర్థిక వృద్ధి పేదరికం తగ్గింపు మరియు జీవన ప్రమాణాల మెరుగుదలకు మరింత సాయపడింది. ఉద్యోగ కల్పన, లింగ సమానత్వం, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ, సామాజిక రక్షణ చర్యలు, వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి, వాతావరణ మార్పుల అనుకూలత మరియు తగ్గించడం వంటి రంగాలలో కూడా విజయాలు నమోదు చేయబడ్డాయి. 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడానికి, ప్రస్తుత జనాభా పెరుగుదల రేటును బట్టి, రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వారి సంఖ్యను ప్రతి సంవత్సరం దాదాపు 110 మిలియన్లకు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రపంచ సవాలును ఎదుర్కోవడంలో ఐక్యరాజ్యసమితి వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత విభాగం 2030 ఎజెండాను సమర్థవంతంగా అమలు చేయడం కోసం అన్ని దేశాలకు పేదరికం తగ్గించడానికి అవసరమైన విధానాలు రూపొందించినప్పుడు అన్ని అంశాల్లోను తగిన మద్దత్తు ఇస్తుంది.
పేదరికం – ప్రపంచం
గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న 110 దేశాలలో 92 శాతం అనగా 6.1 బిలియన్ల ప్రజలలో 1.1 బిలి యన్ల (18 శాతం) మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. సబ్ – సహారా ఆఫ్రికా దేశాలలో 534 మిలియన్లు (47.8 శాతం) మంది దక్షిణాసియా దేశాలలో 389 మిలియన్లు (34.9 శాతం) మంది , తూర్పు ఆసియా మరియు పసిఫిక్ ప్రాంత దేశా లలో 106 మిలియన్లు (9.5 శాతం) , అరబ్ దేశాలలో 53 మిలియన్లలు (4.7 శాతం), లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాలలో 33 మిలియన్లు (4.7 శాతం), యూరప్ మరియు మధ్య ఆసియా దేశాలలో 2 మిలియన్లు (0.2 శాతం) మంది పేద ప్రజలు ఉన్నారు. ప్రతి ఆరుగురిలో ఐదుగురు పేదలు సబ్ సహారా ఆఫ్రికా మరియు దక్షిణాసియా దేశాలకు చెందినవారు. ఈ పేదలలో 387 మిలి యన్ల మంది అల్ప ఆదాయ దేశాలకు, 730 మిలియన్ల మంది మధ్య ఆదాయ దేశాలలో ఉన్నారు. వీరిలో 566 మిలియన్లు మంది18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే..!
84 శాతం మంది పేదలు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. 824 నుండి 991మిలియన్లు మంది పేదలు తగినంత పారిశుధ్యం మరియు వంటచెరకు లేకుండా జీవిస్తున్నారు. పేదరికం రేటు పిల్లలలో 27.7 శాతం, పెద్దలలో 13.4 శాతం ఉందని తెలిపింది.
మన దేశంలో తగ్గిన పేదరికం
గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం 2005-06 మరియు 2019-21 మధ్య 415 మిలియన్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారు. బహుమితీయ పేదలు మరియు పోషకాహారం లేని వ్యక్తుల శాతం 2005/2006లో 44.3% నుండి 2019/2021లో 11.8%కి తగ్గింది మరియు పిల్లల మరణాలు 4.5% నుండి 1.5%కి తగ్గాయి.తాగునీటి సూచికలో, బహుమితీయంగా పేదలు మరి యు వెనుకబడిన వారి శాతం ఈ కాలంలో 16.4 నుండి 2.7కి, విద్యుత్ (29 శాతం నుండి 2.1 శాతానికి) మరియు గృహనిర్మాణం 44.9 శాతం నుండి 13.6 శాతానికి పడిపోయింది. పేదరికం తగ్గుదల సమానంగా ఉంది, ప్రాంతాలు మరియు సామా జిక-ఆర్థిక సమూహాలను తగ్గించింది. వెనుకబడిన కుల సమూహాలలో పిల్లలు మరియు ప్రజలతో సహా పేద రాష్ట్రాలు మరియు సమూహాలు అత్యంత వేగంగా సంపూర్ణ పురోగతిని కలిగి ఉన్నాయి. ఈ విధంగా మన దేశంలో పేదరికం తగ్గడానికి ప్రస్తుత కేంద్ర, సామాజిక అభివృద్ధి పథకాలు అయిన ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ చట్టం, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, జాతీయ పట్టణ జీవ నోపాధి మిషన్, ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, బలహీన వర్గాల ఆర్థిక సాధికారత, ప్రధా నమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, జాతీయ పోషకాహార మిషన్ పోషణ్ మొదలైనవి.
అంతిమ లక్ష్యం
ప్రభుత్వాలు, వ్యాపారాలు మరియు పౌర సమాజ సంస్థల మధ్య బలమైన ప్రపం చ భాగస్వామ్యాలు సమానమైన అభివృద్ధిని సాధించడానికి మరియు ఎవరూ మిన హాయించబడకుండా లేదా వెనుకబడి ఉండకుండా చూసుకోవడానికి చాలా ముఖ్య మైనవి. అందువల్ల, ఈ సంవత్సరం పేదరికంలో ఉన్న ప్రజలకు సంఘీభావంగా నిల బడటానికి, వారి రోజువారీ పోరాటాలను నిజంగా వినడానికి మరియు ఆర్థిక లాభా లను పెంచడం ద్వారా మానవ మరియు పర్యావరణ శ్రేయస్సును రక్షించడంపై దృష్టి సారించిన న్యాయమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించే కట్టుబాట్లను పునరుద్ధరించడానికి ఒక అవకాశం కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే పరిస్థితులను కల్పించడం ద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే అంతిమ లక్ష్యం.
- జనక మోహన రావు దుంగ
8247045230
(నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం)