IPHONE 17 AIR Pre Order Bookings: యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 ప్రీబుకింగ్స్ నేటి నుండి ప్రారంభం కానున్నాయి. భారత కాలమానం ప్రకారం, ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్స్ నేటి సాయంత్రం 5:30 గంటల నుండి ఆన్‌లైన్‌లో స్టార్ట్ అవుతాయి. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా కూడా ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఫోన్ 17లో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో , ఐఫోన్ 17 ఎయిర్ పేర్లతో ఇవి మార్కెట్‌లోకి రిలీజవుతున్నాయి.
ఎలా ఆర్డర్ చేయాలి?
1. ముందుగా యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ లేదా ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేయండి.
2. మీకు కావలసిన ఐఫోన్ 17 మోడల్ (ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్) ఎంపిక చేసుకోండి.
౩. కలర్ ఆప్షన్ (బ్లాక్, బ్లూ, మిస్ట్ బ్లూ, సాగ్, లావెండర్), స్టోరేజ్ (256 జీబీ లేదా 512 జీబీ) ఎంచుకోండి.
4. ఎంపిక చేసిన ఫోన్‌ను కార్ట్‌లో జోడించండి.
5. చెక్ అవుట్‌పై క్లిక్ చేసి క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ లేదా ఇతర పేమెంట్ గేట్‌వేల ద్వారా పేమెంట్ చేయండి.
6. పేమెంట్ పూర్తయిన తరువాత ప్రీ-ఆర్డర్ కన్ఫర్మేషన్ SMS/Email వస్తుంది.
7. సెప్టెంబర్ 19వ తేదీ నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి.
అధిరిపోయే డిస్‌ప్లే, అద్భుతమైన ఫీచర్లు..
1. 6.3 ఇంచుల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే విత్ ప్రోమోషన్ (120Hz రిఫ్రెష్ రేట్)
2. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ (ఐఫోన్ 16 కంటే 50% ఎక్కువ బ్రైట్‌నెస్ ఇస్తుంది)
3. A19 ప్రో చిప్‌సెట్ A15 కంటే 1.5 రెట్లు వేగంగా పనిచేస్తుంది
4. ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే, వైఫై 7, బ్లూటూత్ 6
5. 48 ఎంపీ మెయిన్ కెమెరా+48 ఎంపీ 2x టెలిఫోటో+ 18 ఎంపీ ఫ్రంట్ కెమెరా
6. 40W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ (20 నిమిషాల్లో 50% ఛార్జ్)
7. 25W వైర్‌లెస్ ఛార్జింగ్
8. ఐఓఎస్ 26, IP68 రేటింగ్ (వాటర్ & డస్ట్ రెసిస్టంట్)
ఏ మోడల్స్ ధర ఎంతంటే?
ఐఫోన్ 17ను బ్లాక్, వైట్, మిస్ట్ బ్లూ, సేజ్, లావెండర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఇందులో 128జీబీ మోడల్ మాత్రం తీసుకురాలేదు. ఇక ఐఫోన్ 17కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.82,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,02,900గా ఉంటుంది. నేడు ఈ ఫోన్ల ప్రీ ఆర్డర్లు ప్రారంభమవుతుండగా.. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కాగా, ఐఫోన్ 17కు చెందిన ఇ-సిమ్ ఓన్లీ మోడల్‌ను బహ్రెయిన్, కెనడా, గువామ్, జపాన్, కువైట్, మెక్సికో, ఓమన్, కతార్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికాలలో విక్రయించనున్నారు.


