Sunday, November 16, 2025
HomeNewsIRAN URANIUM CENTER : ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి

IRAN URANIUM CENTER : ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి


Israel Attack On Iran Uranium Center : ఇరాన్‌లోని నతంజ్ యురేనియం శుద్ధి కర్మాగారంపై గత శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ దాడి వల్ల కర్మాగారంలోని అండర్‌గ్రౌండ్ సెంట్రీఫ్యూజ్ గదులు దెబ్బతిన్నాయని IAEA శాటిలైట్ ఫోటోల విశ్లేషణ ద్వారా నిర్ధారించింది. అంతేకాదు, భూమిపై ఉన్న ఒక హాల్, అందులోని ఎలక్ట్రికల్ పరికరాలు కూడా ధ్వంసమయ్యాయని గుర్తించారు.

ఇరాన్‌కు అణ్వాయుధం ఉండటానికి వీల్లేదు – జీ7 దేశాల స్పష్టమైన హెచ్చరిక :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “ఇరాన్‌కు అణ్వాయుధం ఉండకూడదు” అని ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ఇజ్రాయెల్ కూడా ఇదే కోరుకుంటూ గత శుక్రవారం ఇరాన్‌లోని యురేనియం శుద్ధి కేంద్రాలపై భీకర దాడులు చేసింది. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సులో కూడా “ఇరాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం దక్కకూడదు” అని స్పష్టం చేస్తూ, ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఇది ఇరాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.

తెహ్రాన్‌లో భయం గుప్పిట్లో ప్రజలు – భారీగా వలసలు
ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా ఇరాన్ రాజధాని తెహ్రాన్‌పై ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నగరాన్ని ఖాళీ చేయాలని అల్టిమేటం ఇవ్వడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అంతకుముందు ఇజ్రాయెల్ కూడా ఇదే హెచ్చరిక చేసింది, తెహ్రాన్‌లోని 3.30 లక్షల మంది ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు తెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుంటుండటంతో, ప్రజలు భారీగా పరిసర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు, దీంతో నగరంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

దుకాణాలు మూత, ఇంధన కొరత భయం :
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తెహ్రాన్‌లో చాలా దుకాణాలు మూతపడ్డాయి, ప్రాచీన గ్రాండ్ బజార్ కూడా తెరుచుకోలేదు. ప్రజలు కాస్పియన్ సముద్రం వైపు వలస వెళ్తున్నారు, ఇంధన కొరత భయంతో గ్యాస్ స్టేషన్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. నగరం అంతటా “ఇజ్రాయెల్‌ను బలంగా ప్రతిఘటించండి” అంటూ ప్లకార్డులు వెలిశాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా, ఇరాన్ ప్రభుత్వం వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad