తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చింది ఐఆర్ఎస్ సంఘం. ఈమేరకు ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సంఘం తరపున రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు రూ. 25,00,000 భారీ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.
- Advertisement -
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఆదాయపు పన్ను ఉద్యోగుల సేవా సంఘాలు ఐఆర్ఎస్ అసోసియేషన్, ఐటీజీఓఏ, ఐటీఈఎఫ్ చొరవ తీసుకున్నాయి. ఈమేరకు ఏపీ సీఎంఆర్ఎఫ్ కు రూ. 12,50,000/, తెలంగాణ సీఎంఆర్ఎఫ్ కు రూ. 12,50,000/- అందజేసాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విరాళాన్ని ఐఆర్ఎస్ సంఘాలు ముట్టజెప్పి తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నాయి.