Saturday, November 15, 2025
HomeNewsIsrael Iran War India Map : సారీ చెప్పిన ఇజ్రాయెల్ ఆర్మీ

Israel Iran War India Map : సారీ చెప్పిన ఇజ్రాయెల్ ఆర్మీ

ISRAEL IRAN WAR : తప్పుడు ఇండియా మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఇజ్రాయెల్ సైన్యం శనివారం క్షమాపణలు చెప్పింది. భారత సరిహద్దులను కచ్చితత్వంతో ఆ మ్యాప్‌లో చూపలేకపోయినందుకు చింతిస్తున్నామని పేర్కొంది. తాము ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసిన మ్యాప్‌లో జమ్మూకశ్మీరును పాకిస్తాన్‌లోని భూభాగంగా చూపించినందుకు క్షమాపణలు తెలిపింది.

- Advertisement -


భారత్ కు క్షమాపణలు :
ఇరాన్ వద్ద ఉన్న మిస్సైళ్ల పరిధిని చూపించే మ్యాప్‌ను ఇజ్రాయెల్ సైన్యం ఇటీవల పోస్ట్ చేసింది. అయితే, ఆ మ్యాప్‌లో జమ్మూకశ్మీర్‌ను పాకిస్తాన్ భూభాగంగా చూపించడంతో భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పొరపాటును గుర్తించిన ఇజ్రాయెల్ సైన్యం తక్షణమే క్షమాపణలు చెప్పింది. ఇరాన్ ప్రపంచానికి ముప్పుగా మారిందని, తమ లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ తప్పుడు మ్యాప్‌తో కూడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు, కానీ భారత రాయబారి భారత్‌లోని ర్యూవెన్ అజార్ చొరవతో దాన్ని తొలగించారు.

భారత్ ధర్మబద్ధంగా వ్యవహరిస్తుంది :
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ మధ్యవర్తిత్వం వహించే సామర్థ్యం ఉందని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అన్నారు. భారత్‌కు ఇరు దేశాలతోనూ సత్సంబంధాలు ఉన్నాయని, భారత్ ధర్మబద్ధంగా వ్యవహరిస్తుందని తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఇరాన్ అణుబాంబు తయారీకి ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో వేలాది మిస్సైళ్లను తయారు చేయాలని చూస్తోందని, ఇది తమ అస్తిత్వానికి ముప్పు అని అజార్ తెలిపారు. అందుకే తాము ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేశామని వివరించారు

విమాన షెడ్యూల్‌ను తనిఖీ చేసుకోండి :
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం కారణంగా ఇరాన్, ఇరాక్, వాటి చుట్టుపక్కల దేశాల గగనతలం ప్రస్తుతం సమస్యాత్మకంగా ఉంది. ఈ నేపథ్యంలో, ఇండిగో విమాన ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అడ్వైజరీ జారీ చేసింది. ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే విమాన సర్వీసుల వేళలు, మార్గాల్లో మార్పులు, జాప్యాలు ఉండొచ్చని తెలిపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఇండిగో వెబ్‌సైట్ లేదా యాప్‌లో తమ విమాన షెడ్యూల్‌ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించింది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad