Saturday, November 15, 2025
HomeNewsRecharge Plans: డేటా తెగ వాడేస్తున్నారా? ఈ రీఛార్జ్ ప్లాన్స్ మీకోసమే!

Recharge Plans: డేటా తెగ వాడేస్తున్నారా? ఈ రీఛార్జ్ ప్లాన్స్ మీకోసమే!

Recharge Plans: ప్రీపెయిడ్ ప్లాన్‌లలో డేటా తక్కువగా ఉంటుంది. అధికంగా ఇంటర్నెట్ వాడే వారికీ తక్కువ డేటా సరిపోదు. అలాంటి వారి కోసం జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్-ఐడియా కొన్ని గొప్ప డేటా ప్యాక్‌లను తీసుకొచ్చింది. వీటిలో దాదాపు 50GB డేటాను పొందొచ్చు. ఈ డేటా ఎటువంటి రోజువారీ డేటా పరిమితి లేకుండా వస్తుంది. కాకపోతే, ఈ ప్లాన్‌లన్నీ డేటా ప్యాక్‌ల కోసమే. కావున వీటిలో ఉచిత SMS లేదా కాలింగ్ ప్రయోజనాలను ఉండవు. ప్రత్యేకత ఏమిటంటే..? వీటిలో కొన్ని డేటా ప్యాక్‌లలో OTT యాప్‌ల యాక్సెస్ కూడా పొందొచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

ఎయిర్‌టెల్ రూ. 361 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.361 ప్లాన్ దాదాపు 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ లో ఇంటర్నెట్‌ను ఉపయోగించడానికి మొత్తం 50GB డేటా అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ. 451 ప్లాన్
30 రోజుల చెల్లుబాటుతో వస్తున్న ఈ ప్లాన్ లో 50GB డేటా లభిస్తుంది. ఇందులో కంపెనీ మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తోంది.

Also Read: Thomson Masterclass Series Mini LED TV: అదిరిపోయే ఫీచర్లతో థామ్సన్‌ నుంచి మినీ LED టీవీలు..

జియో రూ. 359 ప్లాన్
ఈ జియో ప్లాన్ చెల్లుబాటు 30 రోజులు. ఇందులో కంపెనీ ఇంటర్నెట్ వినియోగం కోసం 50GB డేటాను అందిస్తోంది.

ఐడియా రూ. 348 ప్లాన్
వోడాఫోన్ ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ వినియోగం కోసం 50GB డేటాను అందిస్తుంది. ప్లాన్ చెల్లుబాటు దాదాపు 28 రోజులు.

ఐడియా రూ. 1189 ప్లాన్
ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో కంపెనీ ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 50GB డేటాను అందిస్తుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad