Tuesday, September 17, 2024
HomeNewsఅటు కాజల్..ఇటు శ్రీలీల..మధ్యలో అనిల్ రావిపూడి ..మాములుగా లేదుకదా..

అటు కాజల్..ఇటు శ్రీలీల..మధ్యలో అనిల్ రావిపూడి ..మాములుగా లేదుకదా..

- Advertisement -

వరుస విజయాలతో దూసుకెళ్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి..ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి చేస్తున్నాడు. అఖండ , వీర సింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ఊపు మీదున్న బాలయ్య..ఇప్పుడు అనిల్ తో కలిసి వస్తుండడం తో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. అంతే కాదు కాజల్ , శ్రీలీల వంటి క్రేజీ హీరోయిన్స్ కూడా ఉండడం తో సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా..అనే ఆత్రుత పెరుగుతుంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎప్పటికప్పుడు షూటింగ్ తాలూకా అప్డేట్స్ , వీడియోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్స్ లో హీరోయిన్ కాజల్ , శ్రీలీల ఇద్దరూ బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించిన వీడియోని అనిల్ రావిపూడి తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఈ మధ్యనే అనిల్ రావిపూడి ఫైట్ మాస్టర్ డాన్స్ మాస్టర్ లతో కలిసి బాలయ్య బాబు పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్ అయింది. అయితే తాజా వీడియోలో మాత్రం అనిల్ రావిపూడి కాకుండా హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రీ లీల బాలయ్య సూపర్ హిట్ సాంగ్ ‘చిలకపచ్చ కోక’ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి పంచుకుంటూ..” నేను బాలయ్య బాబు పాటకి వేసిన డాన్స్‌కు ఈర్ష్యగా ఫీల్ అవుతూ మా హీరోయిన్స్ ఇద్దరూ నా ముందు డాన్స్ చేయడం అస్సలు ఆపడం లేదు” అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియోలో కాజల్, శ్రీ లీల డాన్స్ స్టెప్పులకు అనిల్ రావిపూడి విజిల్స్ వేయగా.. మా డాన్స్ ఇంకా అయిపోలేదు అంటూ శ్రీలీలా, కాజల్ మరోసారి స్టెప్పులు వేశారు. మీరు కూడా ఈ డాన్స్ ఫై లుక్ వెయ్యండి.

https://www.instagram.com/reel/Ctq-oVYAmu-/?utm_source=ig_web_copy_link
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News