Thursday, December 5, 2024
HomeNewsKamareddy: వీఆర్ఏ వారసులకు ఉద్యోగాల కోసం ధర్నా

Kamareddy: వీఆర్ఏ వారసులకు ఉద్యోగాల కోసం ధర్నా

ఉద్యోగాల కోసం..

వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతూ సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. 61 సంవత్సరాలు వయసు పైబడిన వీఆర్ఏ వారసులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 81 ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని అన్నారు. వీఆర్ఏలకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని జీవో నెంబర్ 81 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం రాకపోతుందా అని కొందరు తండ్రి ఉద్యోగం కోసం అన్నదమ్ములకు ఉన్న అరేకరం ఎకరం భూమి రాసి ఇచ్చారు అప్పులు చేసి తమ సోదరులకు లక్షల రూపాయలు వాటా కింద ఇచ్చారు. అప్పులు చేసి తమ సోదరులకు డబ్బులు ఇచ్చి ఉద్యోగం రాక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆర్థికంగా మానసికంగా వీఆర్ఏ కుటుంబాలు ప్యూర ఇబ్బందులను పడుతున్నామనీ అన్నారు.

- Advertisement -

కొందరు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా చాలామంది వీఆర్ఏలు చనిపోయారని, ఇంకా అనేక మంది వీఆర్ఏలు అనారోగ్యాలతో బాధపడుతున్నారన్నారని వాపోయారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ వారసత్వ ఉద్యోగాలు తమకు ఇప్పించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు నర్సింలు, రాజయ్య, లక్ష్మణ్, పరువయ్య, సోమయ్య, మల్లయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News