Sunday, June 15, 2025
Homeచిత్ర ప్రభKannappa Trailer Prabhas: కన్నప్ప ట్రైలర్ అదుర్స్.. ప్రభాస్ నట విశ్వరూపం

Kannappa Trailer Prabhas: కన్నప్ప ట్రైలర్ అదుర్స్.. ప్రభాస్ నట విశ్వరూపం

Kannappa Trailer: శివ భక్తుడైన కన్నప్ప పాత్రలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. 2 నిమిషాలు 55 సెకన్లతో ఉన్న ఈ ట్రైలర్‌లోని VFX, విజువల్ గ్రాండ్‌నెస్ లకు ప్రశంసలు వెల్లువెతుతున్నాయి.

టెక్నికల్ వాల్యూస్, స్టీఫెన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యి మూవీపై అంచనాలను మరింత పెంచేస్తూ రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో భారీ తారాగణం కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లలో చూసిన బాలీవుడ్ , టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ లలో అతి పెద్ద స్టార్ నటులతో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని మంచు మోహన్ బాబు (24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ), AVA ఎంటర్‌టైన్‌మెంట్ కింద నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బూరా సాయిమాధవ్ తో పాటు విష్ణు మంచు కథ, మాటలు అందిస్తున్నారు.

- Advertisement -

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ప్రదర్శించిన ఈ చిత్ర టీజర్ కి మంచి స్పందన లభించింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ క్యాస్టింగ్.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్ ముఖ్య నటీనటులు ఇందులో నటిస్తుండగా ప్రభాస్ ఓ కీలక పాత్రలో కనిపిస్తుండటం సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతుంది.

శైవ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిన యాత్రాత్మక ఇతిహాస చిత్రాన్ని రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ గ్రాఫిక్స్, విజువల్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

కన్నప్ప సినిమా స్టోరీ అంతా వాయులింగం చుట్టూ నడవనున్నట్టు ట్రైలర్ ను బట్టి అర్ధం అవుతోంది. ఓ గూడెం లోని కొన్ని తెగల మధ్య ఈ వాయులింగం కోసం ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు.. అక్కడ దేవుడనే వాడే లేడనుకునే ఓ వ్యక్తి ఆ తర్వాత క్రమంలో పరమ శివభక్తుడిగా ఎలా మారాడు? ఆ వాయులింగం కోసం ఎలా పోరాడాడు అనేది ప్రధానాంశంగ తెరకెక్కించినట్లుగా ట్రైలర్‌లో తెలుస్తోంది.

2023లో శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమంతో మొదలైన ఈ చిత్రాన్ని ప్రధానంగా న్యూజిలాండ్‌లోని వివిధ లొకేషన్లలో తెరకెక్కించారు. విడుదల తేదీనీ మొదట 2025 ఏప్రిల్ 25గా అనుకున్నా పలు వివాదాల కారణంగా జూన్ 27, 2025 కి వాయిదా వేసింది చిత్ర యూనిట్.

సినిమా మొదలైనప్పటినుండే ఏదో విధంగా వివాదాల్లోకి ఎక్కుతోంది ఈ చిత్రం. ఫుటేజ్ ఉన్న హార్డ్ డ్రైవ్ చోరీ కావడం, అలాగే టీజర్ లో మంచి విష్ణు చెప్పిన కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం సినిమాపై నెగెటివ్ టాక్ ను తెచ్చాయి. అయితే వాటన్నింటికి భిన్నంగా ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ కు ఊహించని స్పందన వస్తోంది. మంచి విష్ణు అభిమానులతో పాటు మిగతా ఆడియన్స్ కూడా ఈ చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉందని.. విడుదల కోసం వారాంతం వెయిట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో చెబుతున్నారు. మరికొంటన మంది ట్రైలర్ లో ప్రభాస్ చూసిన తర్వాత.. రెబల్ స్టార్ కామియో తోనైనా సినిమా హిట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News