Thursday, April 3, 2025
HomeNewsరాకేష్ మాస్టర్ మరణంపై షాకింగ్ కామెంట్స్ చేసిన కరాటే కళ్యాణి

రాకేష్ మాస్టర్ మరణంపై షాకింగ్ కామెంట్స్ చేసిన కరాటే కళ్యాణి

- Advertisement -

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణం ఫై షాకింగ్ కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి. వారం రోజుల క్రితం వైజాగ్ షూటింగ్ కు వెళ్లిన రాకేష్ మాస్టర్.. అక్కడ విపరీతమైన మద్యం సేవించాడు. దీంతో ఆయనకు రక్త విరోచనాలు అయ్యాయి. రక్త విరోచనాలు ఎక్కువ కావడం తో ఆయన్ను గాంధీ హాస్పటల్ లో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆదివారం కన్నుమూశారు. సోమవారం బోరబండ లోని స్మశాన వాటికలో రాకేష్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రాకేష్ మృతదేహాన్ని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు , డాన్సులర్లు పోటీపడ్డారు.

ఈ క్రమంలో రాకేష్ మాస్టర్‌ని నివాళులు తెలియజేసిన కరాటే కళ్యాణి అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ‘రాకేష్ మాస్టర్ చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. వ్యసనాలకు బానిసైపోయారు. అన్ని విధాలుగా అలవాట్లను కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇక జప్ఫా షో అని ఆయనకి నచ్చింది ఏదో చేస్తున్నారు. దానిపై నెగిటివ్ కామెంట్లు చేయడం దారుణమన్నారు. అసలు రాకేష్ మాస్టర్‌ని కామెంట్ చేసే అర్హత వీళ్లకి ఉందా? ఆయన అనుభవం అంత వయసు ఉండదు వీళ్లకి. అలాంటి వాళ్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చూసి ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారు. పైకి ఎంత ధైర్యంగా ఉన్నా.. లోపల బాధపడతారు ఎవరైనా. ఓ పక్క ఆయన లైఫ్ పోయింది.. ఇంకో పక్క కెరియర్ పోయింది.
ఇలాంటి వెధవలంతా అనే మాటల్ని విని మానసికంగా డిప్రెషన్‌లోకి వెళ్లారు. అయినా సరే పోరటం చేస్తూనే ఉన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి మందుని అలవాటు చేసుకున్నారు.. ఇలా తాగితాగి చివరికి చనిపోయారంటూ కళ్యాణి ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News