Thursday, April 3, 2025
HomeNewsKavitha letter to Sonia: సమాంతర రిజర్వేషన్లు ఏంటి? కవిత ఫైర్

Kavitha letter to Sonia: సమాంతర రిజర్వేషన్లు ఏంటి? కవిత ఫైర్

సోనియా, ఖర్గేకు కవిత లెటర్

 రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మండిపడుతూ ఎమ్మెల్సీ కవిత యూపీఏ ఛైర్పర్సన్ సోనియాకు లెటర్ రాశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని సోనియాకు రాసిన లేఖలో కవిత వెల్లడించారు. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని లెటర్ లో కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆమె లేఖ రాశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News