Tuesday, September 17, 2024
HomeNewsKCR collapses: కొంప ముంచిన మంత్రులు, సిట్టింగులు

KCR collapses: కొంప ముంచిన మంత్రులు, సిట్టింగులు

ప్రభుత్వ వ్యతిరేకతను కేర్ చేయని కేసీఆర్

తెలంగాణ మంత్రులు చాలామంది ఓటమిపాలవ్వటం విశేషం. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఓడిపోవటం హైలైట్. సిట్టింగులకే టికెట్లు ఇచ్చిన కేసీఆర్ అతిపెద్ద తప్పు చేస్తున్నారని రాజకీయ పండితులు ఊహించినట్టే సిట్టింగులంతా కలిసి కేసీఆర్ కొంప కూల్చారు. బీఆర్ఎస్ ఒంటెత్తు పోకడలు, కుటుంబ పాలన, పదేళ్ల యాంటీ ఇన్కంబెన్సీ, బీఆర్ఎస్ నేతల అవినీతి, రాష్ట్రంలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకపోవటం, అణచివేత ధోరణి వంటివెన్నో అంశాలు కారును గ్యారేజీకి పంపేలా చేసాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్ వన్ మ్యాన్ షో నడపటం పార్టీకి చాలా మైనస్ గా మారింది. ఇవే అంశాలన్నీ కాంగ్రెస్ కు కలిసి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

3వ స్థానంలో బీఆర్ఎస్

పార్టీ మారిన నేతలందరికీ కర్రు కాల్చి వాత పెట్టిన ప్రజలు చాలా చోట్ల బీఆర్ఎస్ ను మూడవ స్థానంలో నిలిపారు. గువ్వల బాలరాజు, క్రాంతి కిరణ్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్ వంటి యువ నేతలు, ఓయు విద్యార్థి సంఘం మాజీ నేతలను ప్రజలు ఇంటికి పంపారు. వనమా వెంకటేశ్వర్ రావు, సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, మెచ్చా నాగేశ్వర్ రావు, ఉపేందర్ రెడ్డి, సురేందర్, హర్షవర్ధన్ రడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి  ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఆతరువాతి కాలంలో టీఆర్ఎస్ లో చేరారు.  ఇలా పార్టీని మారినవారందరినీ ప్రజలు సాగనంపారు.  ఇలా ఒక పార్టీ టికెట్ పై గెలిచి, మరో పార్టీలో చేరినందుకు వీరు ప్రజావిశ్వాసం కోల్పోయి, ఓటమిపాలయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News