Ketu Nakshtra Transit 2025 effect: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ఈ క్రమంలో శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఛాయా గ్రహమైన కేతువు ఎల్లప్పుడూ తిరోగమనంలోనే నడుస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. 2026 డిసెంబరు వరకు ఇదే రాశిలో ఉంటాడు. కేతువు యెుక్క ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారు సమస్యలు తీరిపోనున్నాయి. ఆ రాశులు ఏవో ఓ లుక్కేద్దాం.
సింహరాశి
కేతువు పుబ్బ నక్షత్ర సంచారం సింహరాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలన్నీ దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
తులా రాశి
తులా రాశి వారికి కేతువు సంచారం అద్భుతంగా ఉండబోతుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతోంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి.
కుంభరాశి
కుంభరాశి వారికి కేతు గోచారం శుభఫలితాలను ఇస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలమిస్తాయి. మీరు లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. వ్యాపారులు నష్టాల నుంచి బయటపడతారు. మీ కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది.
మేష రాశి
పుబ్బ నక్షత్రంలో కేతు సంచారం మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వీరు కెరీర్ లో సక్సెస్ అవుతారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. సంతానప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
Also read: Sun transit 2025- కేతు నక్షత్రంలోకి సూర్యుడు.. ఆగస్టులో ఈ 3 రాశులు ముట్టిందల్లా బంగారం..
కర్కాటక రాశి
కేతువు నక్షత్ర సంచారం కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీరు అనుకున్న స్థాయికి వెళతారు. అప్పుల బాధ నుండి బయటపడతారు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితులు సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా పై కథనాన్ని రూపొందించడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
Also read: Saturn Transit 2025- కృష్ణాష్టమి తర్వాత ఈ 4 రాశులకు మంచి రోజులు.. మీది ఉందా?


