Wednesday, November 27, 2024
HomeతెలంగాణPatnam Narender | నరేందర్ వారికోసం బాధపడుతున్నారు -KTR

Patnam Narender | నరేందర్ వారికోసం బాధపడుతున్నారు -KTR

చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) తో కేటీఆర్ (KTR) సహా బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైల్లో పరామర్శించామని చెప్పారు. రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు నరేందర్ రెడ్డి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) ని కలిసినప్పుడు ఆయన తన గురించి కాకుండా 30 మంది అమాయక రైతులను విడిపించండని చెప్పారని, అందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు. కొడంగల్ లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారు… వారికోసం పోరాటం చేయండని చెబుతూ నరేందర్ రెడ్డి బాధపడినట్లు కేటీఆర్ చెప్పారు.

ఇంకా కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…

సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారు.

కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారు.

కొడంగల్ లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు, పిల్లలపై అరాచాకలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తి పై పగబట్టారు. రేవంత్ రెడ్డి కోసం ఆయన మొన్నటి ఎన్నికల్లో పనిచేశారు.

కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి తోవ లేకుండా చేశారు. ఆ క్షోభ, అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. గతంలో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా?

సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నీ సామ్రాజ్యమా, నువ్వు చక్రవర్తివా? వెయ్యి ఏళ్లు బతకటానికి వచ్చావా?

సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే కుదరదు. నువ్వు నియంత కాదు. నువ్వు చక్రవర్తి కాదు. నీలాంటి వాళ్లు చాలా మంది కొట్టుకుపోయారు. నువ్వు కూడా కొట్టుకుపోతావ్.

శిశుపాలుడి తప్పులను ఆనాడు లెక్కించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, రేవంత్ రెడ్డి పాపాలను ప్రజలు ఇప్పుడు లెక్కిస్తున్నారు.

భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నారు.

అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయిరెడ్డి, గురువా రెడ్డి లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారు.

సొంత గ్రామంలో చేస్తున్న అరాచకాల పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది.

నీ కన్నా పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారు.

మా నేత నరేందర్ రెడ్డి చాలా ధ్యైర్యంగా ఉన్నాడు. పేదలు, గిరిజన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరాడు.

మహబూబాబాద్ లో మేము చేపట్టనున్న ధర్నా బాగా చేయాలంటూ మాకు ఉత్సాహానిచ్చారు.

నరేందర్ రెడ్డి గారికి చేయని తప్పునకు జైల్లో ఉన్న 30 మంది అమాయక రైతుల కుటుంబాలకు ఒకటే చెబుతున్నాం.

మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది.

రేవంత్ రెడ్డి మిమ్మల్ని నాలుగు రోజులు జైల్లో పెట్టవచ్చు. కానీ ఆయనకు మళ్లీ రాజకీయ జీవితం లేకుండా చేసే బాధ్యత మీ మీద ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News