Saturday, November 15, 2025
HomeNewsKTR on Cable wire Removing: హైదరాబాద్‌లో కేబుల్‌ వైర్లు తొలగించడంపై కేటీఆర్‌ సీరియస్‌!

KTR on Cable wire Removing: హైదరాబాద్‌లో కేబుల్‌ వైర్లు తొలగించడంపై కేటీఆర్‌ సీరియస్‌!

KTR Tweet on Cable wires Removing: హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ (GHMC), విద్యుత్ సిబ్బంది ఇంటర్నెట్ కేబుల్‌ వైర్లను తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నియంత్రుత్వ పోకడను ఆయన తప్పుబట్టారు. సరైన సమాచారం లేకుండా కేబుల్‌ వైర్లను తొలగించడంపై ఆయన ఎక్స్‌లో సీరియస్‌ అయ్యారు.

- Advertisement -

ఇంటర్నెట్ కెేబుళ్లను కట్‌ చేయడం వల్ల నగరంలో విద్య, వ్యాపారం, ఆరోగ్య రంగాలకు ఇంటర్‌నెట్‌ సమస్య ఏర్పడిందని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఆన్‌లైన్‌ సేవలపై ఆధారపడి జీవించే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హెచ్చరించారు. ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతోన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోందని.. ఇటువంటి తరుణంలో చిన్న చిన్న సదుపాయాల్ని ప్రభుత్వం ఆటంకం కలిగిస్తే అది రాష్ట్ర అభివృద్ధికే ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

 

ప్రభుత్వం తక్షణమే సమస్యకు మూల కారణాలను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ చర్య సర్కస్‌ని తలపిస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రతి సమస్యను తీవ్రంగా పరిగణిస్తోందని.. అత్యవసరమైన ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కేబుల్‌ ఆపరేటర్లు, ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల ధర్నా:

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ అధికారులు వైర్ల తొలగింపును కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో కేబుల్‌ ఆపరేటర్లు, ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు సదరన్‌ డిస్కం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్‌ వైర్లతో ఏమాత్రం సంబంధం లేని కేబుల్‌ వైర్లను తొలగించడంపై వారు సీరియస్‌ అవుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. అంతే కాకుండా విద్యుత్‌ సిబ్బంది కేబుల్‌ ఆపరేటర్లపై దురుసుగా వ్యవరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే ఈ ట్వీట్‌పై అధికార ప్రతినిధులు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇదే సమయంలో ఇంటర్నెట్ సేవలు త్వరగా తిరిగి సమర్థంగా అందుబాటులోకి రావాలని నగర ప్రజలు ఆశిస్తున్నారు.

వరుస ఘటనలతో చర్యలు:

విద్యుదాఘాతంతో రామాంతపూర్‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి దష్యా ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు ఈ సర్క్యూలర్‌ని ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ వ్యాప్తంగా ఈ కేబుల్‌ వైర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ చర్యకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని కేబుల్‌ ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు కోరుతున్నారు. ప్రమాదాలకు కరెంట్‌ పాస్‌ కానీ తమ కేబుల్‌ వైర్లకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad